అమెరికా: ఉబెర్ క్యాబ్‌లపై 6,000 లైంగిక వేధింపుల ఫిర్యాదులు  

6000 Sexual Accused Cases on Uber In Merica - Telugu 6000 Sexual Accused Cases On Uber, Nri, Sexual Harrasment, Telugu Nri News Updates, Uber In Merica

అమెరికా వ్యాప్తంగా 2017 మరియు 2018 సంవత్సరాల్లో తమ క్యాబ్‌లలో ప్రయాణించిన వారి నుంచి దాదాపు 6,000 లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందినట్లు ఉబెర్ తెలిపింది.2018లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రయాణాల సంఖ్య ఎక్కువ ఉన్నందున ఘటనల రేటు 16 శాతం తగ్గింది.వరుస ఘటనల నేపథ్యంలో ఉబెర్ లండన్‌‌లో క్యాబ్‌లు నడిపేందుకు లైసెన్స్‌ను కోల్పోయింది.

6000 Sexual Accused Cases On Uber In Merica

అమెరికాలో రెండేళ్ల కాలంలో 2.3 బిలియన్ల ప్రయాణాలు జరగ్గా… వీటిలో 5,981 లైంగిక వేధింపుల సంఘటనలు నమోదయ్యాయి.చాలా కంపెనీలు లైంగిక హింస వంటి సమస్యల గురించి మాట్లాడవని.

ఎందుకంటే అలా చేయడం వల్ల సంస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అయితే తమ నివేదిక కొత్త విధానానికి నాంది పలికిందని ఉబెర్ చీఫ్ లీగల్ టోనీ వెస్ట్ అన్నారు.గత రెండేళ్ల కాలంలో ఆడిటింగ్‌ ద్వారా సేకరించిన డేటాను ఖచ్చితత్వంతో ప్రచురించినట్లు ఆయన తెలిపారు.

ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ తరహా నివేదికను విడుదల చేయాలని ఉబెర్ నిర్ణయించింది.అమెరికన్ మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని మిగిలిన దేశాల్లోనూ ఈ పద్ధతిని అమలు చేయాలని భావిస్తోంది.అయితే ఇది అనుకున్నంత తేలికైన పని కాదు.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నివేదికను విడుదల చేయడం వల్ల ఉబెర్ క్యాబ్‌లు ఇతర సంస్థల కన్నా సురక్షితమైనవా కావా అన్నది తెలుసుకోవచ్చునని కొందరు చెబుతున్నారు.2017లో ఉబెర్ క్యాబ్‌లలో 2,396 లైంగిక వేధింపుల ఘటనలు నమోదవ్వగా.2018లో 3,045 ఘటనలు నమోదైనట్లు ఉబెర్ తెలిపింది.2017లో అమెరికా వ్యాప్తంగా 1 బిలియన్ ట్రిప్పులు నడపగా.గతేడాది అది 1.3 బిలియన్లకు చేరింది.

#NRI #Uber In Merica

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

6000 Sexual Accused Cases On Uber In Merica Related Telugu News,Photos/Pics,Images..