ఊబర్ హెలికాఫ్టర్లు మరీ ఇంత చీపా

ఊబర్ గురించి చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది క్యాబ్స్,అలానే ఊబర్ ఈట్స్.క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు,అలానే ఫుడ్ డెలివరీ లో కూడా ఊబర్ ను చాలా మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

 Uber Helicopter Ride Is Briefly Cheaper Than Uber Car Ride Food Delivery-TeluguStop.com

అయితే ఇప్పుడు ఉబర్ తన టెక్నాలజీలో అభివృద్ది తీసుకువచ్చి వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా హెలికాఫ్టర్ సర్వీసులను తీసుకువచ్చింది.అమెరికా లోని మన్‌హాటన్‌లో ఈ సేవలను ప్రారంభించిన ఆ సంస్థ, కారు కంటే తక్కువ ఖర్చు కే హెలికాఫ్టర్ రైడ్ ని అందుబాటులో ఉంచడం విశేషం.ఉదహరణకు మన్‌హాటన్‌ నుంచి జేకేఎఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు ఊబర్‌ హెలికాప్టర్‌ 108.98 డాలర్లు వసూలు చేస్తుండగా, అదే ప్రయాణానికి కారు సర్వీస్‌ అయితే 163.11 డాలర్లు వసూలు చేస్తున్నారట.అంటే కారు ప్రయాణం కంటే హెలికాప్టర్ ప్రయాణమే చౌకగా మారిపోయింది.

దీనితో జనాలు ఇప్పుడు కారు సర్వీస్ కు బదులుగా హెలికాఫ్టర్ సర్వీస్ నే ఉపయోగించుకొనే పరిస్థితి నెలకొనింది అన్నమాట.

Telugu Delivery, Helicapter, Mhanhatanjkf, Uber, Uberhelicopter-

ఇక, సాధారణ హెలికాప్టర్‌ 200 నుంచి 225 డాలర్లు చార్జ్‌ చేస్తారు.అలా చూసుకుంటే దాదాపు సగానికి సగం వినియోగదారులకు డిస్కౌంట్ లభించడం తో ఊబర్ రైడ్ కె మొగ్గు చూపుతున్నారు.అయితే, హెలికాప్టర్‌ సర్వీసు చార్జి కూడా దూరం, సమయం, రద్దీ, డిమాండ్‌ను బట్టి ఉంటుందని ఉబర్ కూడా చెబుతోంది.

అంటే దీనిని బట్టి ఆ సమయం,పరిస్థితుల ను బట్టి దాని రైడ్ కూడా పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు అన్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube