ఐడియా అదిరింది.. క్షణాల్లో క‌రోనా బాధితులను గుర్తిస్తున్న శున‌కా‌లు!!

క‌రోనా.మూడ‌క్ష‌రాలే అయినా ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.ఎప్పుడు నాశ‌నం అవుతుందో అని ప్ర‌జ‌లంద‌రూ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.కానీ, వ్యాక్సిన్ వ‌స్తేగాని ఈ మ‌హ‌మ్మారి అంతం కాద‌ని తేల‌డంతో.ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా విరుగుడు కోసం వంద‌ల ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు.

 Uae Uses K9 Sniffer Dogs To Detect Corona Patients!! Uae, K9 Sniffer Dogs, Dete-TeluguStop.com

ఇక క‌రోనా వ‌చ్చి ఆరేడు నెల‌లు గ‌డుస్తున్నా.వ్యాక్సిన్ అందుబాటులో రాక‌పోవ‌డంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌ను సులువుగా క‌నిపెట్టేందుకు.యూఏఈ పోలీసులు అదిరిపోయే ఐడియా వేశారు.

కరోనా బాధితులను గుర్తించేందుకు వీలుగా శున‌కాల‌ను శిక్షణ అందించారు.

ఈ ఐడియా వర్క్ వుట్ అవ్వ‌డంతో.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం ఎయిర్ పోర్టులో ‘కే9ఫోర్స్‌’ పేరుతో శునకాలను ఏర్పాటు చేశారు.శిక్షణ పొందిన శున‌కాలు ఎయిర్ పోర్ట్‌లో ఏం చేస్తాయి అంటే.

ప్రయాణికులు విమానం నుంచి దిగగానే వారిని ఒక ఛాంబర్ లో ఉంచుతున్నారు.వారి చెమట శాంపిళ్లను సేకరిస్తున్నారు.

శిక్షణ పొందిన కుక్కలకు వీటిని వాసన చూపిస్తున్నారు.

కరోనా ఉన్న శాంపిల్‌ను గుర్తించగానే అక్కడే కూర్చుండిపోతాయి.

అప్పుడు ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.ఇక ఇప్పటివరకూ శున‌కాలు పసిగట్టిన కేసుల్లో 92 శాతం నుంచి 94 శాతం వరకు సక్సెస్ రేటు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.దీంతో ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఈ విధానంపై దృష్టిసారించిన‌ట్టు తెలుస్తోంది.ఏదేమైనా క‌రోనా బాధితుల‌ను త్వ‌ర‌గా, సులువుగా గుర్తించేందుకు ఈ విధానం బాగా ఉప‌యోగ‌పడుతుంద‌నే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube