దేశ జనాభా కంటే ఎక్కువ కోవిడ్ టెస్టులు నిర్వహించిన దేశంగా ఆ దేశం రికార్డ్..!

గత సంవత్సరం చైనాలో డిసెంబర్ నెల నుంచి మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా వైరస్ బారినపడి అనేక ఇబ్బందులు ఎదురుకున్నారు.

 Uae First Country To Conduct More Covid-19 Tests Than Its Population, Uae, Covid-TeluguStop.com

అలాగే అనేకమంది ఈ వైరస్ దెబ్బకు ప్రాణాలు కూడా వదిలారు.ఇకపోతే కొన్ని దేశాలలో ఈ కరోనా మహమ్మారి తీవ్రతను అదుపులో ఉంచడానికి లాక్ డౌన్ లాంటి వాటిని కూడా అమలు చేసి కొద్దిమేర విజయం సాధించాయి.

ఇక ఈ కరోనా వైరస్ గల్ఫ్ దేశాల్లో కూడా బాగానే విజృంభిస్తుంది.ముఖ్యంగా యూఏఈ లో భారీ సంఖ్యలో ఈ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఒకవైపు అధికారులు అనేక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న కానీ కరోనా పరిస్థితి మాత్రం అక్కడ ఆగడం లేదు.ప్రతి రోజూ అక్కడ కనీసం ఒక వెయ్యి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఇకపోతే ఇప్పటివరకు యూఏఈ దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య ఏకంగా 10.5 మిలియన్లకు చేరుకుంది.అయితే ఇందులో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటున్నారా.? అదేనండి అసలు విషయం.ఒక మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో ఆ దేశ జనాభా కంటే ఎక్కువ కోవిడ్ టెస్టులు నిర్వహించిన దేశంగా యూఏఈ రికార్డు సృష్టించింది.

ఇక ఇది ఇలా ఉండగా యూఏఈ లో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా రెండు వేల పాజిటివ్ కేసులు పైగా నమోదయ్యాయి.

అంతే కాకుండా ప్రస్తుతం అక్కడ తొమ్మిది వేల యాక్టీవ్ కేసులు మాత్రమే ఉన్నాయి.కరోనా వైరస్ దెబ్బకి ఆ దేశంలో ఇప్పటివరకు 438 మంది మృత్యువాత పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube