ఫారిన్ నుంచి వచ్చిందని.. అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వని జనం: కడుపులోనే బిడ్డను కోల్పోయిన ఎన్ఆర్ఐ  

Uae Pregnant Woman Mangalore - Telugu Mangalore, Pregnant Lady, Pregnant Woman Loses Baby As Mangalore Apartment Denies Her Entry Upon Arrival From Uae, Uae

కరోనా కారణంగా దేశం కానీ దేశంలో ఎన్నో ఇబ్బందులు పడి, భారతదేశానికి వస్తే స్వదేశంలోని ప్రజల మూర్ఖత్వం కారణంగా నిండు గర్బిణీ తన బిడ్డను కోల్పోయింది.విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట ప్రత్యేక విమానాలు నడుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో దుబాయ్‌లో నివసిస్తున్న కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ ప్రవాస భారతీయురాలు భారత్‌కు వచ్చేందుకు తన పేరును రిజస్టర్ చేసుకుని సంతోషంతో మాతృదేశానికి బయల్దేరింది.మే 12న ఆమె దుబాయ్ నుంచి నేరుగా మంగళూరు చేరుకోగా.

 Uae Pregnant Woman Mangalore

అధికారులు నిబంధనల ప్రకారం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.అక్కడ మూడు రోజులు ఉంచి కోవిడ్ 19 పరీక్షలు చేశారు.

ఆమెకు నెగిటివ్ రావడంతో చేతిపై హోం క్వారంటైన్ ముద్ర వేసి ఇంటికి పంపించారు.

ఫారిన్ నుంచి వచ్చిందని.. అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వని జనం: కడుపులోనే బిడ్డను కోల్పోయిన ఎన్ఆర్ఐ-Telugu NRI-Telugu Tollywood Photo Image

దీంతో నగరంలోని తన ఇంటికి చేరుకుంటుండగా.ఆమె చేతిపై క్వారంటైన్ ముద్రను చూసి ఫ్లాట్‌లోకి వెళ్లేందుకు అపార్ట్‌మెంట్ వాసులు అనుమతించలేదు.ఆ తర్వాత స్థానిక ఆసుపత్రుల్లోనూ ఎవరూ చేర్చుకోలేదు.

తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు కొద్దిరోజుల్లోనే కడుపులోని బిడ్డను కోల్పోయింది.ఈ ఘటన మంగళూరులో సంచలనం సృష్టించడంతో మున్సిపల్ కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితురాలిని అడ్డుకున్న అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు నోటీసులు ఇచ్చారు.ఆమెను అడ్డుకోవడానికి కారణం ఏంటో తెలపాలంటూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

గర్బిణీ మహిళ తొలుత క్వారంటైన్ కేంద్రం నుంచి ఇంటికి వచ్చినప్పుడు అపార్ట్‌మెంట్ వాసులు అనుమతించలేదని, ఆ సమయంలో తాను ఏం చేయలేకపోయామని ఆమె బంధువు కన్నీటిపర్యంతమయ్యారు.ఆమెను స్థానిక ఆసుపత్రుల్లోనూ చేర్చుకోలేదని, వైద్య సేవలు కూడా అందించలేదని అన్నారు.

చివరికి చేసేదిలేక ఆమెను ఓ హోటల్‌కు తరలించగా.అక్కడ బాధితురాలు హైపర్ టెన్షన్‌కు గురైందని చెప్పారు.

కడుపులో బిడ్డ చనిపోవడం, తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uae Pregnant Woman Mangalore Related Telugu News,Photos/Pics,Images..

footer-test