“భారత్” పరువు తీసిన “భారత ఎన్నారై “       2018-05-20   03:29:40  IST  Bhanu C

ఎంతో మంది ప్రవాసీయులు భారత్ నుంచీ ఎన్నో దేశాలకి వెళ్లి ఎన్నో విజయాలు సాధిస్తూ భారత్ కి మంచి పేరు తీసుకు వస్తుంటే కొంతమంది మాత్రం దేశం కాని దేశంలో ఎలా ఉండాలో కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ భారత పరువు తీస్తున్న ప్రభుద్దులు ఉన్నారు అయితే..తాజగా జరిగిన ఒక సంఘటన మానవీయ విలువలు ఈ కాలంలో ఎంతగా దిగజారి పోతున్నాయో తెలుపుతున్నాయి..వివరాలలోకి వెళ్తే ..


భారత్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి యూఏఈలోని దుబాయ్ నగరంలో నేరానికి పాల్పడ్డాడు. తన ఇంటి దగ్గరలో ఉన్న పార్క్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు..బాలికపై అసభ్యకరంగా చేతులు వేస్తూ ముద్దులు పెడుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు..అయితే ఆ బాలిక సదరు ఎన్నారై ని నుంచీ ఎంత దూరంగా ఉంటున్నా సరే వేదిపులు ఆగలేదు..

అయితే కూతురు ఏం చేస్తుందో చూసేందుకు వెళ్లిన తండ్రి భయపడుతున్న బాలికను ఏమైందని ప్రశ్నించగా అసలు విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది…దాంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు ఎన్నారై ని అదుపులోకి తీసుకున్నాడు…అయితే ఈ విషయం కోర్టు నిందితుడికి ఖటినమైన శిక్ష వేయనుందని..కోర్టులో విచారణ జరగనుందని, నిందితుడు తగిన శిక్షను ఎదుర్కోనున్నాడని పోలీసులు తెలిపారు.