యూఏఈ కొత్త వీసా నిభందనలు..అందుకోసమే

యూఏఈ ప్రభుత్వం సంవత్సర కాలంగా తమ దేశంలో ఎన్నో కీలక మార్పులని చేస్తోంది అన్ని దేశాలు ఆర్ధికంగా ధృడంగా లేకపోయినా సరే అభివృద్దిలో దూసుకు పోతుంటే ఆర్ధికంగా ఎంతో బలవంతులుగా పేరున్న యూఏఈ మాత్రం వెనకపడి పోవడానికి కారణం అక్కడి వీసా నిభందనలు పర్యాటకానికి సద్వినియోగం చేసుకోక పోవడమే.

 Uae New Visa Rules For New Jobs-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ విధానానికి యూఏఈ ప్రభుత్వం నీళ్ళు వదులుతోంది.

ఒక్కో సారి ఒక్క నిభంధలనని సడలిస్తూ తన దేశానికి విదేశీయులు పెద్ద సంఖ్యలో వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది .

అయితే ఈ క్రమంలోనే గత నెలలో తమ దేశంలోకి విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి తమ వీసా నిభంధనలలో మార్పులు తీసుకువచ్చి 5 ఏళ్ళకి ముగిసే వర్క్ పర్మిట్ ని 10 ఏళ్ళకి పెంచింది ఈ మార్పుతో యూఏఈ లో పెట్టుబడులు పెట్టేవారి సమాఖ్య గణనీయంగా పెరిగిందని తాజా నివేదికలో తెలిపింది.అయితే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్న యూఏఈ ప్రభుత్వం మరో సరికొత్త పర్యాటక వీసా నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది…18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారికి వీసా ఫీజు నుంచి మినహాయింపునిచ్చింది.ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ఆదివారం ప్రకటించింది.

ఈ వీసా సడలింపు పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న నిర్ణయమని అధికారులు వివరణ ఇచ్చారు.అయితే పర్యాటకుల సంఖ్యని పెంచడానికి “ట్రాన్సిట్ వీసా” ను జారీ చేస్తామని ఇటీవలే ప్రకటించిన అక్కడి ప్రభుత్వం తాజాగా తీసుకున్న వలన ఏంటో మంది పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube