టీచర్‌ జాబ్‌కు నెలకు రూ. 4 లక్షల సాలరీ... మీరు ఏమైనా ప్రయత్నిస్తారా?

ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు.అంటే అన్ని వృత్తుల వారికంటే, అన్ని జాబ్స్‌ కంటే కూడా బడిపంతులు జాబ్‌కు జీతం తక్కువ ఉండేది.

 Uae Government Is Paying Indian Teachers Huge Salary-TeluguStop.com

ఇండియాలో అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవి.అందులో చేసే వారికి కూడా చాలా తక్కువ జీతాలు ఉండేవి కనుక అలాంటి సామెత పుట్టుకు వచ్చింది.

అయితే ఇప్పుడు ఆ సామెత ఏమాత్రం సెట్‌ అవ్వదు.ఎందుకంటే ఇప్పుడు బడి పంతుల్లకు వేలల్లో జీతాలు ఉంటున్నాయి.

ప్రైమరీ స్కూల్‌ టీచర్‌కే 30 వేల జీతం ఆరంభంలోనే ఉంటుంది.రిటైర్మెంట్‌ వరకు లక్షకు దాటుతుంది.

అందుకే ఈమద్య కాలంలో టీజర్‌ జాబ్స్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది.కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా టీచర్‌ జాబ్స్‌కు విపరీతమైన జీతాలు ఉంటున్నాయి.

టీచర్‌ జాబ్‌కు నెలకు రూ. 4 లక్ష�

ఎక్కువ జీతాలు ఇస్తామని చెబుతున్నా కూడా కొన్ని దేశాల్లో టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంటుంది.యూఏఈ వంటి దేశాలు విదేశాల నుండి తమ ప్రభుత్వ పాఠశాలలకు టీచర్‌లను తీసుకు వస్తున్నారు.తాజాగా యూఏఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండియాలోని ముంబయి మరియు ఢిల్లీ ఇంకా ముఖ్య నగరాల్లో టీచర్‌ జాబ్‌కు రాత పరీక్షలు నిర్వహించారు.తమ దేశంలో టీచర్‌గా జాబ్‌ చేయాలనుకునే వారికి ఆహ్వానం పలికింది.

యూఏఈలో టీచర్‌ జాబ్‌పై ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి అంటూ కొన్ని వారాల క్రితం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.అందులో శాలరీ ఆఫర్‌ను కూడా ముందే ప్రకటించారు

టీచర్‌ జాబ్‌కు నెలకు రూ. 4 లక్ష�

ఆరంభంలోనే నెలకు అలవెన్స్‌లతో కలిపి 4 లక్షల వరకు జీతంగా ఇస్తామని ప్రకటనలో పేర్కొనడం జరిగింది.ప్రస్తుతం టీచర్స్‌గా చేస్తున్న వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది.40 ఏళ్లు దాటకుండా ఉండాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.యూఏఈలో టీచర్‌ గా పని చేసే అవకాశం దక్కించుకోవాలంటే వారి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు.రెగ్యులర్‌గా ఈ పరీక్షలు, ఈ ఎంపిక కార్యక్రమం జరుగుతుందట.

అందుకే మీరు ప్రస్తుతం టీచింగ్‌ ఫీల్డ్‌లో ఉండి, మంచి ఇంగ్లీష్‌ మరియు హిందీ మాట్లాడగలిగితే ప్రయత్నించండి

నలుగురికి ఉపయోగపడే ఈ పోస్ట్‌ను తప్పకుండా షేర్‌ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube