దుబాయ్ వెళ్ళే వారికి.. ఫ్రీ ట్రాన్సిట్ ...వీసా       2018-06-18   23:28:38  IST  Bhanu C

ఎంతో మంది సరదాగా గడపడానికి వివిధ దేశాలు తిరుగుతూ ఉంటారు..అయితే ముఖ్యంగా అందరూ ఎక్కువగా పర్యటించే ప్రాంతం మాత్రం యూఏఈ మాత్రమే అయితే ఎంతో మంది తమ దేశం వస్తున్నందుకు గాను ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది…48 గంటలకాల వ్యవధి ఉండేలా ఉచిత ట్రాన్సిట్‌ వీసాలను త్వరలో అందుబాటులోకి తీసుకు రానుంది. దీంతో పాటు మరో రెండురోజులు అదనంగా అంటే మొత్తం 96గంటల పాటు ఈ వీసా గడువును పొడించుకోవాలంటే మాత్రం 50దీహ్రామ్‌ (రూ.930) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే వివిధ దేశాల నుంచీ దుబాయి వెళ్ళే వారిలో అత్యధికులు మాత్రం ఇండియన్స్ అని అధికారిక లెక్కల ప్రకారం తెలిపింది..అయితే ఈ ఆఫర్‌ను ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికులు దుబాయ్‌కే వెళ్తున్నారు. దుబాయ్‌ టూరిజం అధికారిక లెక్కల ప్రకారం.. సుమారు 1.8కోట్ల మంది భారతీయులు ప్రతి ఏడాది యూఏఈకి వెళ్తున్నారట .

అంతేకాదు దుబాయ్ ని అత్యధికులు ఎంతో సుందర ప్రదేశాలుగా చూస్తారు అందుకే ఎంతో మంది ఇండియన్స్ కి ఇప్పుడు ఈ దేశాలు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు అయ్యాయి..అంతేకాదు భారతీయులకి షాపింగ్ చేయడానికి గాను విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా దుబాయ్ అనుకూల ప్రదేశం…భారత్‌ నుంచి వచ్చే, వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల్లో 25%మంది యూఏఈ విమాన సర్వీసులైన ఎమిరేట్స్‌, ఫ్లై దుబాయ్‌, ఎతిహాద్‌ల్లోనే భారత్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు…అయితే దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో ఎంతో మంది భారతీయ టూరిస్టు లకి సంతోషాన్ని ఇస్తుంది