పదేళ్ళ ప్రస్థానం...ఘన చరిత్ర కలిగిన ఈ...'యూఎస్ కాన్సులేట్'

అమెరికాలో స్థిరపడాలి అంటే తప్పకుండా వీసా సంపాదించాలి…వీసా కావాలి అంటే ఒకానొక సమయంలో తెలుగువారు చెన్నై.ముంబయి.

 U S Consulate General Hyderabad History-TeluguStop.com

కోల్‌కతాల్లోని యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయాలకు వెళ్లేవారు.సరే అక్కడ పని వెంటనే అయిపోతే పర్వాలేదు.

లేకుంటే మాత్రం మళ్లీ రివ్యూ పిటిషన్‌ కోసం వేచి ఉండేవారు.ఇలా వ్యయ ప్రయాసలు పడే వారు.అయితే తెలుగు ప్రజలు కష్టాలు పడుతున్నారని గ్రహించిన ప్రభుత్వాలు.2008లో హైదరాబాద్‌ కేంద్రంగా ఒక ప్యాలెస్‌లో కాన్సులేట్‌ కార్యాలయం ఏర్పాటుకు అమెరికాను ఒప్పించాయి…దాంతో

హైదరాబాద్‌లో తెలుగు ప్రజల కోసం మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశాయి.అంతేకాదు 1985 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైన ఏకైక కాన్సులేట్‌ కార్యాలయం ఇదేకావడం విశేషం…అయితే ఇప్పటికి యూఎస్ కాన్సలేట్ ప్రారంభించి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అంతేకాదు ఈ కాన్సులేట్ నుంచీ అధిక సంఖ్యలో వీసాలు రికార్డ్ స్థాయిలో జారీ అవుతున్నాయి.

అంతేకాదు ఈ కాన్సులేట్ నుంచీ విద్యార్థి – హెచ్‌-1బీ, ఎల్‌-1, హెచ్‌-4 వీసాలు పొందుతున్నవారిలో తెలుగువారే అగ్రస్థానంలో ఉన్నారు.దేసవ్యప్తంగా అమెరికా కాన్సులేట్ల కి వస్తున్నా వీసా ధరఖాస్తుల్లో అగ్రస్థానం ఇక్కడినుంచీ వస్తున్నాయట.

ఈ కాన్సులేట్ ఇప్పటికే లక్షల సంఖ్యలో వీసా దరఖాస్తులను పరిశీలించి.యువతకు విద్యార్థి…ఉద్యోగ వీసాలు మంజూరు చేస్తూ ప్రపంచంలోనే టాప్ -5 కాన్సులేట్ కేంద్రంగా పేరొందింది.ఇదిలాఉంటే ఈ వీసా కాన్సులేట్ కేంద్రానికి శాశ్వత నిర్మాణం కోసం ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం దాదాపు 12 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించింది.అయితే ప్రస్తుతం ఉన్న భవనం లో కేవలం 10 ఇంటర్వ్యూ కౌంటర్లు ఉండగా త్వరలో నిర్మిచ్న్హే భవనం లో దాదాపు 52 కౌంటర్ లు ఉంటాయట దాంతో రోజుకి సుమారు 2 వేల వరకు వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube