సిఏఏపై సుప్రీంలో పిటీషన్ వేసిన అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం  

U.n. Human Rights Chief Goes To Supreme Court Against Caa - Telugu Bjp, Indian Government, Nrc, To Supreme Court Against Caa, U.n. Human Rights Chief

మోడీ సర్కార్‌ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఢిల్లీలో గత కొద్ది రోజులు ఈ ఆందోళనలు హిస్మాత్మకంగా మారి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

U.n. Human Rights Chief Goes To Supreme Court Against Caa

ఈ చట్టంని వ్యతిరేకిస్తూ విపక్షాలు అల్లర్లుని ప్రేరేపిస్తున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తూ ఉండగా.అధికార పార్టీ ముసుగులోనే ఈ దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఇది దేశం అతి పెద్ద సమస్యగా మారింది.ఈ నేపధ్యంలో ఈ సమస్యపై కొంత మంది ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం ముందుకి వెళ్ళారు.

వారు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ విషయాన్ని జెనీవాలోని యుఎన్‌హెచ్‌ఆర్‌సి హైకమిషనర్‌ మిచ్చెల్లె బచేలెట్‌ కార్యాలయం సోమవారం ధ్రువీకరించింది.

దీనిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.సిఎఎ అనేది పూర్తిగా భారత అంతర్గత అంశమని, రాజ్యాంగానికి లోబడి ఉందని, దీనిపై అంతర్జాతీయ సమాజం తలదూర్చకుండా ఉండటం ఉత్తమం అని విదేశాంగ శాఖకి చెందిన అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

భారతదేశ విభజన తర్వాత నెలకొన్న మానవ హక్కుల సమస్యలపై దీర్ఘకాలిక జాతీయ నిబద్ధతను ఇది ప్రతిబింభిస్తుందని, తమ దేశ సార్వభౌమత్వానికి చెందిన అంశాలపై ఇతరులు కలుగజేసుకోరని విశ్వసిస్తున్నామని అన్నారు.ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో చట్టబద్ధంగా వాదనలు వినిపిస్తామని చెప్పారు.

గతకొంత కాలంగా మిచ్చెల్లె బచేలెట్‌ సిఎఎ, ఎన్‌ఆర్‌సిలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ చర్యల ద్వారా భారత్‌లోని ముస్లింలు అస్తిత్వంకి ప్రమాదం కలుగుతుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం వేసిన ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఏం సమాధానం చెబుతుంది అనేది ఇప్పుడు దేశీయంగా ఆసక్తి పెంచుతుంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు