చనిపోయిన తర్వాత కాలి బొటన వేళ్లను కట్టడానికి గల కారణం తెలుసా?

ఈ భూమిపై మానవుడు ప్రాణం పోసుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు అతనికి సంబంధించి 16 కార్యక్రమాలను నిర్వహిస్తారు.తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్న అప్పటి నుంచి శ్రీమంతం వేడుకలు, నామకరణం, పుట్టు వెంట్రుకలు ఇలా ఒక మనిషి జీవితంలో 16 కార్యాలను జరిపిస్తుంటారు.

 Tying The Toes,death,tying The Toes After Death,blood Circulation, Indian Sampra-TeluguStop.com

మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తుంటారు.ఇందులో భాగంగానే మనిషి చనిపోయిన తరువాత రెండు కాళ్ల బొటనవేళ్లను తాడుతో కట్టేసి ఉంటారు.

అలా ఎందుకు కడతారో ఎప్పుడైనా ఆలోచించారా?అలా కట్టడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మనిషి చనిపోయిన తర్వాత చేసే కొన్ని కార్యక్రమాలను గురించి ప్రస్తుత కాలంలో ఉన్నవారికి బహుశా తెలియకపోవచ్చు.మన పెద్ద వాళ్ళు ఇలాంటి ఆచారాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే చేస్తుంటాం.

అయితే మనం చేసే ప్రతి కార్యం వెనుక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది.మనిషి చనిపోయిన తర్వాత తన శరీరం నుంచి ఆత్మ వేరవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే శరీరం నుంచి వెళ్లిపోయిన ఆత్మ తిరిగి అదే శరీరం లోకి రావాలని తిరిగి కుటుంబ సభ్యులతో ఉండాలని అనుకుంటుంది.అలా ఆత్మ తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు కాళ్లలో కదలికలు రాకుండా ఆ బొటనవేలును దారంతో కట్టేస్తారని మన పెద్దలు చెబుతుంటారు.

Telugu Toes-Evergreen

మనం చేసే కార్యక్రమాలలో సైన్స్ కూడా దాగి ఉంటుందని చెప్పవచ్చు.మనిషి చనిపోయిన తర్వాత తన శరీరంలో చలనం ఉండదు కాబట్టి, శరీర అవయవాలకు రక్త ప్రసరణ జరగక బిగుసుకు పోతాయి.అలాంటప్పుడు కాళ్ళు రెండు పక్కకి పోవడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.కాబట్టి కాలి బొటనవేలు, చేతి బొటన వేలు కూడా దారంతో కడతారు.ఇలా కట్టడంవల్ల దహనసంస్కారాలు చేయడానికి కూడా సులభంగా ఉంటుంది.ఆచారం ప్రకారం అయినా సైన్స్ ప్రకారం అయినా చేతివేళ్లను, కాళ్ల వేళ్లను దారంతో కట్టడం వెనుక ఉన్న అర్థం, పరమార్థం ఇదేనని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube