టీడీపీ లోకి ఇద్దరు వైసీపీ కీలక నేతలు   Two YSRCP Leaders Looking Into TDP Party     2017-10-12   00:38:32  IST  Bhanu C

ఒకపక్కవైసీపి అధినేత జగన్..పార్టీని 2019కి ఎలా అయినా సరే అధికారంలోకి తీసుకురావాలని భావిస్తుంటే..మరొకపక్క నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు..అధికార పక్షం..కొత్తగా వస్తున్న జనసేన పవన్ పార్టీలతో పోటీ పడుతూ వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు..మునుపటి ఎన్నికల్లో పవన్ ప్రభావంతో జగన్ సీఎం కల చెదిరిపోయింది. మళ్ళీ అదే తంతు ఇప్పుడు జరగబోతున్న తరుణంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి..అయితే చంద్రబాబు మళ్ళీ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు.

మొన్న అనంతపురం జిల్లలో జరిగిన యువభేరి ఫుల్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి..సక్సెస్ మాట అలా ఉంటే..ఆ సమయంలో అనంతపురంలో ఇద్దరు కీలక వ్యక్తులు వైసీపి అధ్యక్షుడు వస్తున్న సభకి రాకపోవడం..చర్చనీయాంశం అయ్యింది. అనంతపురం జిల్లాలో కొందరు పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారం నిజమవుతుందేమోననిపిస్తోంది.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.జగన్ ఇరువురితో మాట్లాడుదాం అనుకున్నా వారిద్దరూ హాజరుకాలేదు.

ఇది ఇలా ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యువభేరికి రాకపోవడంతో నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని వైసీపీ అధిష్టానం తొలగించింది.ఆ స్థానంలో మైనారిటీ నేత అహ్మద్ నదీమ్ ను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించింది. గురునాధరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమించింది..ఈ పరిణామాలతో కలత చెందిన గురునాధరెడ్డి టికెట్ వస్తుందో రాదో అని టిడీపి నేతలతో టచ్ లో ఉంటున్నారు.అయితే పార్టీలో తనకి తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీ వీడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జేసీదివాకర్ రెడ్డి గురునాధరెడ్డి ని టిడీపిలోకి తీసుకువెళ్ళడంలో ప్రముఖ పాత్ర పోషిస్తునట్ట్లుగా తెలుస్తోంది..ఐతే మరొక నేత మధుసూదన్ రెడ్డి ని టిడీపిలోకి తీసుకువెళ్ళడానికి ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ప్రోద్భలం ఉందని తెలుస్తోంది.ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ 2019లో అధికారంలోకి రావడం ఖాయం అని అంటున్నారు వైసీపి నేతలు. టిడీపిలోకి ఇద్దరు వైసీపి కీలక నేతలు

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.