రెండేళ్ల చిన్నారి తెలియని తనం తో కన్న తల్లిని కోల్పోయింది..తప్పెవరిది ?

విధి ఎంత బలీయమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అత్యంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం.

 Two Year Baby Mistake Goes Viral In Social Media Sharkam-TeluguStop.com

కన్న తల్లి తన పిల్లలను చంపేయడం, కన్న తండ్రి కర్కశంగా పిల్లలను చంపేయడం మనం ఇప్పటి వరకు చూశాం.అందులో కొన్ని అనుకోకుండా జరిగినవి ఉంటాయి.

తల్లి లేదా తండ్రి చేతిలో పిల్లలు అనుకోకుండా చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.అయితే ఇప్పుడు చెప్పబోతున్న సంఘటన రివర్స్‌లో జరిగింది.

ఆ చిన్నారికి అభంశుభం తెలియదు.ప్రస్తుతంకు ఆ చిన్నారి ఎలాంటి బాధకు గురి కాకున్నా భవిష్యత్తులో ఆ పాప కుమిలి పోయి ఏడ్చే అవకాశం ఉంది.

Telugu Child Kills Mum, Switchclose, Telugu Nri Ups, Telugu Ups-

  వివరాల్లోకి వెళ్తే.బెలారస్‌ అనే దేశంలో స్టార్రో సెలోకు చెందిన యులియా షర్కామ్‌ అనే 21 ఏళ్ల యువతి ఇటీవల తన పుట్టిన రోజు సందర్బంగా రెండేళ్ల తన చిన్నారి పాప ఇంకా స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది.బీఎండబ్ల్యూ కారులో యులియా అండ్‌ ఫ్రెండ్స్‌ సరదాగా తిరిగి వచ్చారు.పుట్టిన రోజు అవ్వడంతో ఆమె చాలా ఎంజాయ్‌ చేసింది.స్నేహితులతో ట్రిప్‌ను ఆస్వాదించింది.తన కూతురుతో యులియా ఇంటికి తిరిగి వచ్చింది.
స్నేహితులు ఎక్కడి వారు అక్కడకు వెళ్లి పోయారు.ఇంటికి వచ్చిన తర్వాత యులియా కారు దిగి, తన కూతురును కారు దించేందుకు సిద్దం అయ్యింది.అయితే యులియా కారు డోర్‌ ఓపెన్‌ చేయకుండా గ్లాస్‌ సగం కిందకి ఉండటంతో అందులోంచి పాపను అందుకునేందుకు ప్రయత్నించింది.ఆ సమయంలోనే ఆ పాప కారు అదం పైకి లేచే ఒక బటన్‌ను తెలియక నొక్కింది.

దాంతో ఒక్కసారిగా ఆ గ్లాస్‌ పైకి లేచింది.ఆ అద్దం యులియా మెడను గట్టిగా నొక్కడం జరిగింది.
కారు అద్దం నుండి బయట పడటం ఆమె వల్ల కాలేదు.కొద్ది సేపు తీవ్రంగా ప్రయత్నించిన యులియా స్పృహ కోల్పోయింది.కొన్ని నిమిషాలకు అక్కడకు వచ్చిన యులియా భర్త వెంటనే కారు అద్దాలను పగులగొట్టి ఆమెను బయటకు తీశాడు.వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు.

ఆమెకు వైధ్యులు చికిత్స అందించి బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.కాని ఆమె చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మృతి చెందింది.

ఆమె కేవలం 21 ఏళ్ల వయసులోనే తనువు చాలించింది.

Telugu Child Kills Mum, Switchclose, Telugu Nri Ups, Telugu Ups-

 

తన రెండేళ్ల చిన్నారితో ఇంకా ఆట పాటలు, సరదా ముచ్చట్లు ముగియకుండానే కన్నుమూసింది.ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదు.ఆ చిన్నారి భవిష్యత్తులో ఎంత బాధ పడుతుందో అనిపిస్తుంది.

పెద్దయ్యాక తన తల్లిని తానే చంపుకున్నాను అని తెలిసి ఆమె గుండెలు అవిసేలా ఏడిచే అవకాశం ఉంది.యులియా కేసును మర్డర్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube