ఔను! ఆ ఇద్దరమ్మాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.

సాధారణంగా ఒక ఆడ, మగ ఇష్టపడి లేదా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు.ఎక్కువ శాతం ఇదే విధంగా మనువాడతారు.

 Two Women Married Each Other Happened In Haryana-TeluguStop.com

కానీ, అక్కడక్కడా కొన్ని విచిత్ర పెళ్లిళ్లు జరుగుతాయి.అంటే, ఇద్దరు ఆడవాళ్లు లేదా ఇద్దరు మగవాళ్లు పెళ్లిచేసుకుంటారు.

ఇలా ఒకే లింగం వారు పెళ్లి చేసుకున్న ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం.మన దేశంలో ఇటువంటి ఘటనలు తక్కువ.

 Two Women Married Each Other Happened In Haryana-ఔను ఆ ఇద్దరమ్మాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విదేశాల్లో అయితే సాధారణం.ఇక్కడైతే ఇద్దరు అమ్మాయిలు లేదా అబ్బాయిలు కలిసి జీవినం సాగిస్తే అందరూ విచిత్రంగా చూస్తారు.

వారి కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి పెళ్లికి ససేమిరా ఒప్పుకోరు.తాజాగా ఇలాంటి ఘటన హరియాణాలో చోటుచేసుకుంది.

ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు తమ ఏడేళ్ల పరిచయంతో.ఇరువురి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

దీనికి వాళ్ల ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు.ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి వయస్సు 20 ఏళ్లు అయితే, మరో అమ్మాయి వయస్సు 19.

వీరిరువురూ గురుగ్రామ్, జాజర్‌ జిల్లాలకు చెందినవారు.వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేవారు.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.దీంతో వారు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు.అలా ఏళ్లు గడిచిన వారి స్నేహం ప్రేమగా మారింది.దీనికి వారింట్లో వారి అంగీకారం కోరగా వారు తీవ్రంగా వ్యతిరేకించారు.ఇది సమాజ ంలో ఆమోదించే విషయం కాదు.నిర్ణయం మార్చుకోమని చెప్పారు.

అయినా.వారు తల్లిదండ్రుల మాట వినిపించుకోలేదు.

ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు.అనుకున్నట్లుగానే పారిపోయి సోన్‌హాలోని ఓ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

Telugu Court, Gurugram, Haryana, Jajar, Lesbian, Lgbt, Majors, Married Two Women, Mental Condition, Police, Same Gender Wedding, Social Media, Two Girls Marriage, Two Women Married, Viral Marriage-Latest News - Telugu

ఆ అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు.వారిని కోర్టులో హాజరుపరచగా.ఆ యువతులిద్దరూ తాము మేజర్లమని, ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నామని కోర్టుకు తెలిపారు.

కానీ, వారి తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు.వారు వినిపించుకునే పరిస్థితిలో లేరు.

ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని, ఏదేమైనా ఇద్దరం కలిసి జీవిస్తామని చెబుతున్నారని కేసుకు సంబంధించిన పోలీసు అధికారి తెలిపారు.యువత ఈ విధంగా పెడదారిన పట్టడానికి ముఖ్య కారణం కంప్యూటర్లు, ఫోన్లు.

అయినా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.మానసికంగా వాళ్ల ధోరణి ఎలా ఉందా అని గమనిస్తూ ఉండాలి.

#Gurugram #Majors #Court #Social Media #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు