ప్రస్తుత కాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటనలు మన నిత్యజీవితంలో తరచూ చూస్తుంటాం.ఈ క్రమంలో కొందరు మహిళలు తమ అందమైన శరీరాలను ఆయుధాలుగా చేసుకుని కామంతో కొట్టుమిట్టాడుతున్న యువకులను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
కాగా తాజాగా కొంతమంది మహిళలు కొంతమంది గ్రూపు గా ఏర్పడి యువకులను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇటీవల కాలంలో కొందరు మహిళలు సోషల్ మీడియా మాధ్యమాలలో యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారని ఈ క్రమంలో న్యూడ్ వీడియో కాల్, నగ్న ఫోటోలు వంటివాటితో డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు.
అయితే తాజాగా ఇద్దరు మహిళలు పెళ్లికాని యువకులను మరియు పెళ్లయి వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్న వ్యక్తులను టార్గెట్ చేసి అర్ధనగ్న ఫోటోలను పంపుతూ సొమ్ము చేసుకుంటున్నారని కానీ ఈ క్రమంలో ఒక్కోసారి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే యువకుల నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దీంతో బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతులను అరెస్టు చేసేందుకు మారు వేషములో వెళ్లి ఇద్దరు మహిళలను గోవా రాష్ట్రంలో అరెస్టు చేశారు.
అనంతరం నిందిత మహిళలను కోర్టులో హాజరు పరచి రిమాండ్ కి తరలించారు.అయితే ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని కాబట్టి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.