పెరిగిన టూవీలర్ల ధర, అధిక పెట్రోలు ధరలు, ఇతర కారణాల వల్ల మన భారతదేశంలో బైక్స్ అమ్మకాలు నెల నెలకు బాగా తగ్గుతూ వస్తున్నాయి.చిప్ ల కొరత కారణంగా బైక్స్ తో పాటు కార్ల వంటి వాహనాల ఉత్పత్తి కూడా తగ్గుతోంది.
దీనివల్ల ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి.కేవలం ఒక్క మార్చిలోనే వాహనాల అమ్మకాల్లో 4% వరకు క్షీణత కనిపించడం గమనార్హం.
ఈ నెలలో 2,79,501 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.వీటిలో టూవీలర్ల సేల్స్ చాలా తక్కువగా నమోదయ్యాయి.
వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్గనైజేషన్ సియామ్ ఈ గణాంకాలను బయటపెట్టింది.
న్యూ డేటా ప్రకారం, టూవీలర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి.
మార్చి నెలలో టూవీలర్ల అమ్మకాల్లో ఏకంగా 21% తగ్గుదల నమోదైంది.ఈ నెలలో టూవీలర్ల సేల్స్ 11,84,210 యూనిట్లుగా ఉండగా… ఇది 10 ఏళ్ల కనిష్ఠ స్థాయి అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.2021లో ఇదే నెలలో 14,96,806 టూవీలర్ యూనిట్ల విక్రయాలు జరిగాయి.అంటే ఏ స్థాయిలో వీటి సేల్స్ పడిపోయాయో గమనించవచ్చు.
ఇక పేదవారికి ప్రియమైన సైకిళ్ల సేల్స్ ఏకంగా 21 శాతం క్షీణించాయి.

వీటి అమ్మకాల పతనానికి ప్రధాన కారణాలలో ఒకటి ఇంధన ధరల పెరుగుదల. దేశంలో ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.ఇది ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిళ్ల డిమాండ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.
కొత్త మోటార్‌సైకిల్ విక్రయాలు నేరుగా ఇంధన ధరలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, ఎందుకంటే దేశంలోని ఇంధన విక్రయాలలో 62% టూవీలర్ల ఓనర్లే కొనుగోలు చేస్తున్నారు.