ఆ మొక్క రసమే ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడానికి కారణం అంటున్న రెండు గ్రామస్తులు..!

సెకండ్‌వేవ్‌లో అస‌లు కరోనా సోక‌ని ఊరే లేదు.అది వెళ్లని ప్రాంత‌మేలేదు.

 Two Villagers Say That The Only Reason The Corona Case Was Not Registered Was Th-TeluguStop.com

ప‌ట్నం నుంచి ప‌ల్లెటూరి దాకా.సిటీ నుంచి అడ‌వి గ్రామాల దాకా అన్ని ఊర్ల‌ను క‌రోనా క‌మ్మేస్తోంది.

క‌నీసం ఒక్క కేసైనా ఏదో ఒక ఊరిలో ఉండే ఉంటుంది.అదేంటో గానీ కొన్ని ఊర్ల‌ల్లో ఒక్కటంటే ఒక్క కేసు కూడా న‌మోదు కావ‌ట్లేదు.

నిజంగా అది అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.అయితే ఇలాంటి మ‌న తెలంగాణ‌లో కూడా చాలానే ఉన్నాయి.

అలాంటి ఊర్లే ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో కేసులు ఏ స్థాయిలో విజృంభిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.

అయితే ఇక్క‌డ ఓ రెండు గ్రామాల్లో మాత్రం కరోనా కేసులు నమోదు కాక‌పోవ‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.ఆ గ్రామాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదంటే న‌మ్మండి.అయితే ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఓ మొక్క ఔషధాలే త‌మ‌కు కరోనా రాకుండా అడ్డుకుంటోంద‌ని ఆ గ్రామాలు తెలుపుతున్నాయి.

Telugu Bhui Neem, Covid, Immunity, Nagpur-Latest News - Telugu

మ‌రి ఆ మొక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మహారాష్ట్ర లోని నాగపూర్ జిల్లాల్లో తుమ్డీ, జునాపానీ అనే రెండు ఊర్లు ఉన్నాయి.అయితే ఈ రెండు ఊర్ల‌ళ్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా రాలేద‌ని అధికారులు, గ్రామ‌స్తులు చెబుతున్నారు.ఇందుకు తమ గ్రామంలో గల భూయి వేప అనే మొక్కలే కారణమని స్థానికులు, గ్రామ‌స్తులు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు.

ఈ మొక్కను మందుల తయారీలో ఉపయోగిస్తారని తాము ఈ భూయి నీమ్ మొక్క ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగుతూ క‌రోనా రాకుండా ఆరోగ్యంగా ఉంటున్నామ‌ని వారు వెల్ల‌డించారు.

స‌హ‌జంగా అడవిలో దొరికే ఈ భూయి వేప మొక్కల ఆకులను తెచ్చుకుని జ్యూస్ లేదా నీటిలో ఉడికించి ఉదయాన్నే పరగడపున తాగితే ఎలాంటి రోగాలు ద‌రిచేర‌వ‌ని గ్రామస్తులు చెబుతున్నారు.

తాము రోజూ అలా తాగుతున్నందునే తమకు కరోనా సోకలేదని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌న్నారు.అంతే కాదు గ్రామాల్లో ఎవ‌రూ క‌రోనా నిబంధ‌న‌ల కూఆ పాటించట్లేద‌ని, అంతా ఆరోగ్యంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube