మీరి సరిగ్గానే చదివారు.ఇక్కడ గర్భం తల్లికి రాలేదు, తండ్రికే వచ్చింది.
అవును, తండ్రికి గర్భం వచ్చింది.ఈ వింత సౌత్ అమెరికాలో జరిగింది.
బిడ్డ క్షేమంగా ఉంది.విషయం ఏమిటంటే, ఫెర్నాండో మచాడో పుట్టుకతో అమ్మాయి కాని లింగమార్పిడి ద్వారా అబ్బాయిగా మారింది.
ఇతడి/ఈమె (ఎలా అనుకుంటారో మీ ఇష్టం), భాగస్వామి పేరు డియానే రోడ్రిగూజ్.ఇతను పుట్టుకతో అబ్బాయి.
లింగమార్పిడితో అమ్మాయిగా మారాడు.ఇద్దరు ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.మొత్తానికి పండంటి బిడ్డను కన్నారు.
” బిడ్డను కనకుండానే తల్లిగా మారుతానని అనుకోలేదు.నా లాంటి ట్రాస్ జెండర్లు ఇలాంటివి పెద్దగా చూసి ఉండరు.చాలా ఆనందంగా ఉంది.ఏడ్చేసాను నేనైతే.ఇంకా బిడ్డకు పేరు పెట్టలేదు.
త్వరలోనే మంచి పేరు ఆలోచించి పెట్టాలి.ఇప్పటికైతే ఓ ముద్దు పేరుతో నెట్టుకొస్తున్నాం” అంటూ మురిసిపోయింది తల్లి డియానే.
ఇప్పుడు ఓ అరుదైన దంపతుల అరుదైన డెలివరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం అయిపోయింది.ఇంటర్నెట్ లో కూడా జనాలంతా తెగ ముచ్చటిస్తున్నారు ఈ వింత గురించి.