మాటల మాంత్రికుడు త్రివిక్రం( Trivikram ) డైరెక్షన్ లో సినిమా కోసం స్టార్స్ సైతం ఎదురుచూస్తుంటారు.ఇప్పటికే త్రివిక్రం తో స్టార్స్ అంతా సినిమాలు చేస్తుండగా ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రం సినిమా వస్తుంది.
ఈ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా చేయాలని ఇద్దరు స్టార్స్ పోటీ పడుతున్నారని తెలుస్తుంది.ఇంతకీ త్రివిక్రం కోసం ఏ ఇద్దరు స్టార్స్ రెడీ అంటున్నారు అంటే అందులో ఒకరు ఎన్.
టి.ఆర్( NTR ) మరొకరు అల్లు అర్జున్ అని తెలుస్తుంది.అల్లు అర్జున్( Allu arjun ) ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సందీప్ వంగాతో సినిమా ఉంది.అంతకన్నా ముందే త్రివిక్రం తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఇక కొరటాల శివ తో దేవర చేస్తున్న తారక్ కూడా ప్రశాంత్ నీల్ తో నెక్స్ట్ సినిమా చేస్తుండగా ఆ తర్వాత త్రివిక్రం తోనే మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.
అల్లు అర్జున్ తో ఇప్పటికే 3 సినిమాలు చేసి హిట్ అందుకున్న త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో కూడా అరవింద సమేత సినిమా చేశాడు.సో త్రివిక్రం తో సినిమా అనేసరికి ఈ ఇద్దరు స్టార్స్ కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.
అయితే ఎవరు ముందు ఎవరు వెనక అయినా ఇద్దరితో కచ్చితంగా త్రివిక్రం సినిమాలు ఉంటాయని తెలుస్తుంది.