ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోలు...  

Two Tollywood Young Heros Planning Their Marriage In A Same Day - Telugu Nikhil Marriage News, Nitin Marriage News, Tollywood, Tollywood Hero\\'s Marriage News, Tollywood Hero\\'s News, Tollywood Nikhil, Tollywood Nitin

టాలీవుడ్ కి చెందినటువంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.ఇందులో తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించినటువంటి భీష్మ చిత్రం తో ప్రేక్షకులను అలరిస్తున్నయంగ్ హీరో నితిన్ ఒకరు కాగా, ఇటీవల కాలంలో విడుదలైనటువంటి అర్జున్ సురవరం చిత్రంతో బాక్స్ ఆఫీసు వద్ద హిట్ కొట్టిన టువంటి నిఖిల్ సిద్దార్థ్ మరొకరు.

Two Tollywood Young Heros Planning Their Marriage In A Same Day

వీరిద్దరి పెళ్లిళ్లు ఏప్రిల్ 16వ తేదీన జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు.

అయితే ఇందులో నితిన్ దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ప్రాణం ప్రేమిస్తున్నటువంటి శాలిని కందుకూరి ని పెళ్లి చేసుకుంటున్నాడు.

అయితే వీరి వివాహం గ్రాండ్ గా దుబాయ్ దేశంలో జరిపించడానికి ఇరువురు సన్నాహాలు మొదలుపెట్టారు.అయితే పెళ్లి అనంతరం 21వ తారీఖున హైదరాబాద్ నగరంలో రిసెప్షన్ కూడా చేయనున్నారు.

అయితే మరోపక్క మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఏప్రిల్ 16వ తేదీన పల్లవి వర్మ అనే డాక్టర్  ని వివాహమాడుతున్నట్లు ఇప్పటికే నిఖిల్ కుటుంబ సభ్యులు కూడా ప్రకటించారు.అంతేగాక వీరిద్దరికి ఈనెల ఒకటో తారీఖున గోవాలో నిశ్చితార్థం కూడా జరిపారు.మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలో ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఇంటి వాళ్ళు అవుతున్నారు.దీంతో ఈ హీరోల అభిమానులు ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Tollywood Young Heros Planning Their Marriage In A Same Day Related Telugu News,Photos/Pics,Images..

footer-test