పవన్ సినిమాకు రెండు టైటిల్స్ .. ఏది ఫిక్స్ చేసారంటే     2017-11-25   05:50:02  IST  Raghu V

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే చాలు, అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి‌. ఆ ద్వయానికి ఉండే క్రేజు వేరే లెవల్. జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారి హిట్స్ ఇచ్చినందుకు మాత్రమే కాదు, వారిద్దరు వ్యక్తిగత సాన్నిహిత్యం వలన కూడా ఈ జోడికి మార్కెట్ లో స్పెషల్ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే PSPK 25 కి రికార్డు లెవల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అది కూడా కనీసం ఫస్ట్ లుక్ విడుదల కాకుండా, సినిమా పేరు కూడా తెలియకుండా. బ్రాండ్ పవర్ అని దీన్నే అంటారేమో‌.

ఇక ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకుంటే, ఈ నెల 27న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తో కూడిన మొదటి పోస్టర్ ని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏంటని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అజ్ఞాతవాసి అనే టైటిల్ ఎప్పటినుంచో ప్రచారం లో ఉంది. మరి మేకర్స్ ఆ టైటిల్ ని ఇంకా ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు? ఎందుకంటే త్రివిక్రమ్ మెదడులో మరో టైటిల్ కూడా మెదిలింది కాబట్టి. అదే “అనగనగా ఒక రాజు”. అత్తారింటికి దారేది మాదిరి సెంటిమెంట్ కొద్ది దీన్ని కూడా “అ” అక్షరంతో మొదలుపెట్టాలని త్రివిక్రమ్ ఆలోచన. మరి రెండు టైటిల్స్ లో ఏది ఫిక్స్ చేసారు అనేది మాకు కూడా 27 నే తెలియాలి.

హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్, అను ఎమ్మానుయేల్ కథానాయికలు. బోమన్ ఇరాని, ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. సంగీతం సమకూర్చింది అనిరుధ్ రవిచందర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న అతి భారి స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.