ఏపీలో 2వేల కోట్ల కుంభకోణం! ఆదాయపు పన్ను అధికారుల ప్రకటన  

Two Thousand Crores Scam Identified in AP Income Tax Rides - Telugu Ap Income Tax Rides, Ap Politics, Tdp, Two Thousand Crores Scam, Ysrcp

ఏపీలో భారీ అవినీతి కుంభకోణం బయటపడిందా అంటే అవుననే మాట ఇప్పుడు వినిపిస్తుంది.గత కొద్ది రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొంత మంది ప్రముఖులు, వ్యాపారులపై దాడులు చేస్తున్నారు.

Two Thousand Crores Scam Identified In Ap Income Tax Rides

ఈ దాడులలో సుమారు రెండు వేల కోట్ల కుంభకోణం బయటపడినట్లు తెలుస్తుంది.ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

ప్రముఖ వ్యక్తి వద్ద పీఎస్‌ గా పనిచేసిన వ్యక్తి నుంచి కీలకమైన పత్రాలు లభ్యమైనట్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి.

ఈ దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు పేర్కొంది.బోగస్ కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించి, లెక్కలకు దొరకకుండా 2 కోట్ల లోపు నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు.

ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించారు.కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు కూడా రికార్డులలో బహిర్గతం అయ్యిందని తేలింది.

అయితే ఇంత పెద్ద అవినీతి కుంభకోణం అంతా గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆదాయపు పన్ను అధికారులు తెలుపుతున్నారు.మొత్తం చిన్న మొత్తాల రూపంలో బోగస్ కంపెనీలకి వెళ్ళింది రెండు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

దీనిపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలియజేశారు.

#Ysrcp #TDP #AP Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Thousand Crores Scam Identified In Ap Income Tax Rides Related Telugu News,Photos/Pics,Images..