నేడు మరోసారి తెలుగు సీఎంల భేటీ

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు రాష్ట్రాల మద్య సంబంధాలు చాలా దగ్గరవుతున్నాయి.ముఖ్యంగా పలు విషయాల్లో చర్చలు జరిపి పెండింగ్‌లో ఉన్న విషయాలను ఒక కొలిక్కి తీసుకు వచ్చేందుకు ముఖ్య మంత్రులు ఇద్దరు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 Two Telugu Statescms Meet Intoday-TeluguStop.com

విభజన హామీల విషయంలో కేంద్రం చేస్తున్న ఆలస్యం వల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతున్నాయి.అందుకే తమకు తామే పరిష్కరించుకోవలనే ఉద్దేశ్యంతో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్నాయి.

ఇప్పటికే తెలుగు ముఖ్యమంత్రులు ఒక సారి భేటీ అయ్యారు.నేడు మరోసారి భేటికి రంగం సిద్దం అయ్యింది.

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్‌లో తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరు భేటీ కాబోతున్నారు.గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు తరలించే విషయమై చర్చలు జరిగాయి.

ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల ఇంజనీర్స్‌ బృందంను ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్ట్‌పై ఒక నివేదిక తయారు చేయాల్సిందిగా సూచించడం జరిగింది.ఆ ఇంజనీర్స్‌ బృందం ఒక నివేదిక తయారు చేయగా ఆ నివేదికపై చర్చించేందుకు సీఎంలు భేటీ అవ్వబోతున్నారు.

ఈ భేటీలో ఏపీ ఉన్నతాధికారులు మరియు ముఖ్యమైన మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube