సహజంగా చిన్నపిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తారు..ఎంత తిట్టినా కొట్టినా వారి అల్లరిలో మార్పు ఉండదు..అంతేకాదు వారు చేసే పనులు ఒక్కోసారి విపరీతమైన విసుగు తెప్పిస్తాయి..ఇక పిల్లలని సరిగా పట్టించుకోని తల్లి తండ్రులు ఉంటే అల్లరి మాట ఏమో కాని వారు చెడు పనులకి అలవాటు పడిపోతారు..నేరస్తులుగా మిగిలిపోతారు అయితే ఇలాంటి సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది…
కేవలం 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు చేసిన పని అమెరికాలో సంచలనం సృష్టించింది. వారు ఇద్దరు కలిసి ఏకంగా ఒక చిన్న విమానాన్ని ఎత్తుకెళ్ళారు.అందులో విశేషం ఏముందనా వారు ఆ విమానం నడుపుకుంటూ దూరంగా వెళ్ళిపోయారు ఈ ఘటన అమెరికాలో స్థానికులని ఆశ్చర్యానికి గురిచేసింది..
ముందుగా ఈ ఇద్దరు పిల్లలు ట్రాక్టర్ నడుపుతూ ఓ ప్రైవేటు ఎయిర్‌స్ట్రిప్‌కు వచ్చారు…ఈ క్రమంలో అక్కడే నిలిపి వుంచిన ఓ చిన్న విమానాన్ని దొంగిలించారు..అయితే చివరిగా ఆ విమానాన్ని వెర్నల్‌లోని ఓ విమానాశ్రయంలో కిందకు దింపారు…అయితే ఈ ఘటనతో అలెర్ట్ అయిన పోలీసులు ఆ ఇద్దరు పిల్లలని అదుపులోకి తీసుకుని . స్ప్లిట్ మౌంటెయిన్ బాలల నిర్బంధ ఆశ్రమానికి తరలించినట్టు పేర్కొన్నారు..