'ఆ ఇద్దరు'టీడీపీ ఎమ్మెల్యేలు...'కారు'ఎక్కేస్తారా..?

చంద్రబాబు కి టైం అస్సలు బాగొలేదేమో అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.తెలంగాణలో చక్రం తిప్పాలని వెళ్ళిన చంద్రబాబు కి కేసీఆర్ అధికారంలోకి రావడంతో కోలుకొని దెబ్బ పడింది.

 Two Tdp Mla Going To Join In Trs-TeluguStop.com

కూటమిలో కలిసి మళ్ళీ తెలంగాణలో టీడీపీని బ్రతికించుకోవాలని అనుకున్న బాబు ఆశలు ఆవిరి అయ్యాయి.అయితే టీడీపీ పార్టీ తరుపున తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడం బాబు కి కొంత ఊరట నిచ్చింది.

టీడీపీ కి కూకట్ పల్లి , సేర్లింగం పల్లి , సత్తుపల్లి ,అశ్వారావు పేట ఈ నాలుగు పక్కా అనుకుంటే కేవలం బాబు రెండు స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది…అయితే బాబు ఈ రెండు స్థానాలనే పదేపదే చెప్పుకుంటూ మురిసిపోతుంటే ఇప్పుడు ఆ మురిపెం ఎన్నో రోజులు ఉండేలా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

కేసీఆర్ ని టార్గెట్ చేసిన బాబు ని ఇప్పుడు రివర్స్ లో బాబు నే కేసీఆర్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.తెలంగాణలో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి ఉండటానికి వీలులేదని డిసైడ్ అయిన కేసీఆర్ ఆదిసగానే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.టీడీపీ నుంచీ గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మచ్చ నాగేశ్వరరావుల

ఇద్దరు టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారనే వార్తలు తెలంగాణా రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి.

అంతేకాదు రెండు మూడు రోజుల్లో వారు ఇద్దరూ కారెక్కేసి బాబు కి ఘలక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని కూడా తెలుస్తోంది.ఇంకా కేసీఆర్ మరో సారి కూడా తెలంగాణా సీఎం అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందని ఇప్పట్లో టీడీపీ కానీ , కాంగ్రెస్ కానీ పుంజుకునే అవకాశం లేదని ఈ తరుణంలో కేసీఆర్ వెంట నడవడం మంచిదనే వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు సండ్రకు తెరాసలో చేరాల్సిన అవసరం ఎంతన్నా ఉందని ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసులో నిందితుడు కాబట్టి ఆయన కేసీఆర్ తో కండువా తప్పకుండా వేయించుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఇదిలాఉంటే వీరిద్దరిని టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చే భాద్యత తుమ్మల తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది…అయితే ఈ ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి తీసుకొస్తే.కేసీఆర్ మంత్రిపదవి విషయంలో తనను పరిగణనలోకి తీసుకుంటారు అనే ఆలోచన ఉండటంతో తుమ్మల ఆదిసగా అడుగులు వేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి.అయితే తుమ్మల ద్వారా వారు టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేక నేరుగా కేసీఆర్ ని కలిసి కండువా కప్పుకుంటారా, లేక టీడీపీ లోనే కొనసాగుతారా అనేది భవిష్యత్తులో తెలిపోనుందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు…ఇదే గనుకా జరిగితే తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో సైతం చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube