ఆ ప‌బ్‌లో దెయ్యాలు.. వీడియో చూస్తే హ‌డ‌ల్‌

దెయ్యాలు అనే పేరు వింటేనే చాలు గుండెలు జారిపోతాయి.ఎందుకంటే మ‌నం చిన్న‌ప్ప‌టి నుంచే వాటి గురించి డేంజ‌ర్ అనే మాట‌లు వింటున్నాం.

 Two Sisters Found The Paranormal Activity In Their Pub In Uk Watch The Video Det-TeluguStop.com

అయితే దెయ్యాల‌కు సంబంధించి న‌టువంటి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఈ దెయ్యాల‌కు సంబంధించిన చాలా వీడియోలు వైర‌ల్‌ అవుతూనే ఉన్నాయి.

పొగ రూపంలో తిరుగుతోంద‌ని, లేదంటే తెల్ల‌ని రూపంలో క‌నిపిస్తోందంటూ చాలా వీడియోలు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు.

అయితే ఇలాంటి వీడియోల మీద చాలా ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి.చాలా మంది మాత్రం దెయ్యాలు లేవ‌ని అంటుంటే.

కొంద‌రు మాత్రం దెయ్యాలు ఉన్నాయ‌ని ఇలాంటి వాద‌న‌లు వినిపిస్తున్నారు.అయితే ఇప్పుడు కూడా మ‌రో వీడియో ఇలాంటిదే వైర‌ల్ అవుతోంది.

పైగా అది కూడా ప‌బ్‌లోనే దెయ్యాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.ఈ వీడియో యూకేలో ఇద్ద‌రు అక్కా చెల్లెళ్లు క‌లిసి ఓ పబ్‌ను ర‌న్ చేస్తుండ‌గా అందులో జ‌రిగింది.

ఇందులో మెట్ల మీద ఏదో ఒక సౌండ్ వినిపిస్తోంద‌ని, సెల్లార్ లో కూడా వింత శ‌బ్ధాలు వినిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

ఇందులో ఓ అమ్మాయి చేతిలో ఒక పెన్‌ను ప‌ట్టుకుని ఉంటుంది.అయితే దానంత‌ల అదే తిర‌గ‌డం కూడా ఇందులో క‌నిపిస్తుంది.దీంతో వారిద్ద‌రూ భ‌య‌ప‌డిపోయి అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం కనిపిస్తుంది.

ఇందులో ఆ పెన్ను తిర‌గ‌డం కూడా చాలా క్లియ‌ర్ గా క‌నిపిస్తుంది.అయితే ఈ వీడియోలో పొగ రూపంలో కూడా హాల్ లో దెయ్యం తిరుగుతున్న‌ట్టు మ‌నం చూడొచ్చు.

అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల తెగ చెక్క‌ర్లు కొడుతోంది.దీన్ని చూసిన వారంతా కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇది నిజ‌మేనా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube