అమెరికా సైన్యంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అరుదైన ఘనత సాధించారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అరుదైన ఘనత సాధించారు.ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న మరియా బార్రెట్ ఆమె సోదరి పౌలా లోడీలు ఒకే సమయంలో ‘‘ జనరల్’’ ర్యాంక్ పొందారు.

 Two Sisters Achieve Rank Of General In American Army First Soldier Tstop-TeluguStop.com

తద్వారా 244 సంవత్సరాల కలిగిన అమెరికన్ మిలటరీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి అక్కాచెల్లెళ్లు రికార్డుల్లోకి ఎక్కారు.

వారి గురించి తెలిసిన వారికి, వారిని ప్రేమించే వారికి మరియా సిస్టర్స్ సాధించిన ఘనత ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదన్నారు ఆర్మీ తాత్కాలిక కార్యదర్శి రేయాన్ మైఖ్‌కర్తీ.

ఈ ఇద్దరు సోదరీమణులు అమెరికా సైన్యానికి తమ విలువైన సేవలు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా.1901లో ఆర్మీ నర్సింగ్ కార్ప్స్ స్థాపించేవరకు మహిళలను సైన్యంలో అధికారికంగా అంగీకరించలేదు.అయితే యూఎస్.

ఆర్మీ వుమెన్స్ మ్యూజియం ఆధారాల ప్రకారం.నర్సింగ్ కార్ప్స్ స్థాపనకు పూర్వం మహిళలు అనధికారికంగా మిలటరీలో పనిచేశారు.

రెవల్యూషనరీ వార్ సమయంలో వారు మారు వేషంలో పోరాడినట్లుగా ఆధారాలున్నాయి.

Telugu Telugu Nri Ups, Sisters General-

అయితే 2015లో పెంటగాన్, అమెరికా కాంగ్రెస్‌ అన్ని రంగాల్లో మహిళల పాత్రను పెంచేందుకు గాను నిబంధనలు సడలించాయి.వీటి ఫలితంగా అమ్మాయిలు సైతం సైన్యంలో చేరేందుకు మొగ్గు చూపి.ఆర్మీ రేంజర్ పాఠశాలల్లో చేరారు.మొత్తంగా చూస్తే.1.3 మిలియన్ల అమెరికన్ యాక్టివ్ డ్యూటీ ఫోర్స్‌లో మహిళలు 16 శాతంగా ఉన్నారు.417 అడ్మిరల్, జనరల్ ర్యాంక్ అధికారుల్లో 69 మంది మహిళలున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube