బాలయ్య బరిలోకి దిగితే రెండు ప్రాజెక్టులు రెడీ

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Two Projects Waiting For Balakrishna Signal, Balakrishna, Naga Shaurya, Balarama-TeluguStop.com

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కాగా ఈ సినిమాతో బాలయ్యతో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా ఓకే చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే రెండు ప్రాజెక్టులను బాలయ్య పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు చిత్రాల్లో ఒకటి కొత్త డైరెక్టర్ తెరకెక్కించే చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో మరో యంగ్ హీరో నాగశౌర్య కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు ఇంకా బాలయ్య ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదని, త్వరలోనే ఈ సినిమాపై తన నిర్ణయాన్ని తెలియజేస్తాడని తెలుస్తోంది.ఇక ‘కందిరీగ’ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అనే టైటిల్‌తో తెరకెక్కబోయే సినిమాలో బాలయ్యను హీరోగా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాను లెజెండ్ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తుండటంతో బాలయ్య ఈ సినిమాను కూడా హోల్డ్‌లో పెట్టాడట.దీంతో ఈ రెండు చిత్రాలకు సంబంధించి బాలయ్య ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ రెండు చిత్రాల్లో బాలయ్య దేనికి ఓకే చెబుతాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.ఇక బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య చేస్తున్న సినిమాలో భారీ తారాగణం ఉంటుందని, ఈ సినిమా మరో లెజెండ్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube