క‌రోనా అంతానికి రెండే మార్గాలు ఉన్నాయంటున్న నిపుణులు?  

two posibilities for coronavirus ending! two posibilities, coronavirus ending, coronavirus, covid-19, latest news, coronavirus updates - Telugu Coronavirus, Coronavirus Ending, Coronavirus Updates, Covid-19, Latest News, Two Posibilities

గ‌త ఏడాది చైనాలో ప్రాణంపోసుకున్న క‌రోనా వైర‌స్ అతిసూక్ష్మ‌జీవి అయిన‌ప్ప‌టికీ.ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.

TeluguStop.com - Two Posibilities For Coronavirus Ending

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ధాటికి ప్ర‌పంచ‌దేశాల్లోనూ తీవ్ర ప్రాణ‌న‌ష్టంతో పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కూడా ఊహించ‌ని విధంగా దెబ్బ తిన్న‌ది.ఎన్నో కుటుంబాల్లో క‌న్నీరు మిగిల్చిన ఈ క‌రోనా.ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9.6 ల‌క్షల‌కు పైగా మందిని బ‌లితీసుకుంది.మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 3కోట్ల 12 లక్షలు మించి పోయింది.

ఈ లెక్క‌లు చూస్తేనే క‌రోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు.

TeluguStop.com - క‌రోనా అంతానికి రెండే మార్గాలు ఉన్నాయంటున్న నిపుణులు-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న ఈ క‌రోనా ఎప్పుడు అంతం అవుతుంది? అన్న ప్ర‌శ్న అంద‌రి మ‌దిలోనూ మెదులుతోంది.అయితే క‌రోనా వైర‌స్ అంతం కావాడానికి రెండే మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అందులో ఒక‌టి వైద్యపరంగా.క‌రోనాను క‌ట్ట‌డి చేసే స‌రైన వ్యాక్సిన్ రావ‌డం.

వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టైతే క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఇక రెండొవ మార్గం సామాజికంగా.

జాగ్రత్తలతో క‌రోనా వైరస్ ను అంతం చేయడమే అని అంటున్నారు నిపుణులు.ఈ క్ర‌మంలోనే.

ప్రపంచాన్ని వందేళ్ల క్రితం అత‌లాకుత‌లం చేసిన స్పానిష్ ఫ్లూ వైర‌స్ గురించి గుర్తు చేశారు నిపుణులు.అప్ప‌ట్లో దాదాపు కొన్ని కోట్ల మందికి ఈ వైర‌స్ సోకింది.

అలాగే దాదాపు ఐదు కోట్ల మంది స్పానిష్ ఫ్లూతో మృతి చెందారు.రెండు, మూడేళ్లుకు ఆ వైర‌స్ దానంత‌ట అదే నాశ‌నం అయింద‌ని నిపుణులు చెప్పుకొచ్చారు.

అయితే ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన క‌రోనా విష‌యంలోనూ అలాగే జ‌ర‌గాలంటే.క‌రోనా భ‌యంతో ఇంట్లోనే ఉన్నవారంతా బయటకు రావాల‌ని అంటున్నారు.దైనందిన జీవితం మ‌ళ్లీ గాడిలో పడితే… ప్రజల్లో రోగ నిరోధక శక్తి బ‌ల‌ప‌డుతుంది.త‌ద్వారా క‌రోనా వైర‌స్ క్ర‌మంగా అంతం అవుతుంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఆరోగ్య నిపుణులు.క‌రోనా వైర‌స్ నాశ‌నం కావాలంటే.సోష‌ల్ డిస్టెన్స్‌ పాటించాల‌ని.త‌ద్వారా క‌రోనా వైర‌స్‌ వ్యాప్తి ఆగిపోతుంద‌ని అంటున్నారు.ఏదేమైనా ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎలా అంతం అవుతుందో కాల‌మే చెప్పాలి.

#COVID-19 #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Posibilities For Coronavirus Ending Related Telugu News,Photos/Pics,Images..