ఆ జీవి ఉమ్ము ఖరీదు కోటి 50 లక్షలు

నోట్లో ఊరే లాలాజలంకి బయట మార్కెట్లో విలువ ఉంటుందా అంటే ఉండదు అనే చాలామంది భావిస్తారు.అయితే కొన్ని జీవులు స్రవించే లాలాజలంకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా తెలిసింది.

 Two People Have Been Arrested For Allegedly Trying To Sell Ambergris-TeluguStop.com

తాజాగా ముంబైలో రాహుల్ అనే వ్యక్తి స్పెర్మ్ వెల్స్ అనే సముద్ర జీవి లాలాజలం అమ్మడానికి ప్రయత్నించి పోలీసులకు దొరికాడు.దీంతో ఇప్పుడు ఆ స్పెర్ వేల్స్ లాలాజలం గురించి అందరూ తెలుసుకోవడం మొదలెట్టారు.

ఇక సముద్రంలో ఉండే ఆ జీవి లాలాజలం ఖరీదు కిలో ఏకంగా కోటి 70 లక్షల అని తెలుస్తోంది.తిమింగలాల జాతికి చెందిన స్పెర్మ్ వెల్స్ నోటి నుంచి మైనం లాంటి ఓ ద్రవాన్ని స్రవిస్తుంది.

ఈ జీవి పేగుల నుంచి ఉత్పన్నమయ్యే ఈ ద్రవపదార్థం నుంచి ఖరీదైన సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారని తెలుస్తోంది.ఉష్ణమండల సముద్రతీరాల్లో ఎక్కువగా ఉండే ఈ తిమింగలం జాతి సముద్ర జీవులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

అయితే రాహుల్ అనే వ్యక్తి ఆ వేల్ ద్రవపదార్థం సంపాదించి ముంబై మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించాడు.అతన్ని పోలీసులు అరెస్టు చేయగా ఆ ద్రవ పదార్థాన్ని గుజరాత్ కి చెందిన లలిత వ్యాస్ నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పాడు.

దీనిని అతను రాహుల్ గల్ఫ్ కి చెందిన వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.గల్ఫ్ దేశాల్లో ఈ ద్రవపదార్థంకి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దీనిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు.

ఇక ఎంబర్ గ్రీస్ అని పిలవబడే ఈ ద్రవపదార్థంని మండిస్తే కోటీశ్వరులవుతారని ఒక నమ్మకం గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉండటంతో ఈ ద్రవ పదార్ధానికి అంత డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube