బీజేపి ఫతనం షురూ..ఎన్డీయే కి ఆ రెండు పార్టీలు గుడ్ బాయ్

ఒక వైపు మోడీ పెట్రోలు డీజిల్ ,ఆఖరికి వంట గ్యాస్ విషయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలలో మరింత వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నాడు అయితే ఈ క్రమంలో బీజేపి పార్టీకి మిత్రపక్షంగా ఉన్న నాయకులు మోడీ చర్యలతో విసిగిపోయి మోడీ కి భారీ షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట.ఇప్పటికీ ఆపార్టీ యొక్క ఎన్డీయే కూటమికి తెలుగుదేశం పార్టీ గుడ్ బాయ్ చెప్పగా మరో రెండు పార్టీలు సైతం ఇదే వరుసలో ఉన్నాయని తెలుస్తోంది… దేశవ్యాప్తంగా నాలుగు లోక్ సభ – పది అసెంబ్లీ స్థానాలకు ఇటీవలి ఉపఎన్నికల ఫలితాలు ఆ ఇరు పార్టీల కి గుబులు రేపాయి.

 Two Partys Will Left In Nda-TeluguStop.com

ఎన్డీయే లో ఉండాలా బయటకి వచ్చేయాలా అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నాయి.ఇంతకీ ఆ రెండు పార్టీలు ఎవో కాదు.ప్రధాన ఎన్డీఏ పక్షాలైన శివసేన – జనతాదళ్ (యూ).బీజేపీ విస్తరణవాదం – దూకుడు తమ రాజకీయ భవిష్యత్ ని సమాధి చేసేలా ఉన్నాయని వారు తెగ కంగారు పడుతున్నారట.

అయితే శివసేనకి అంతగా బలం లేకపవడం వలన బీజేపి ని గట్టిగా ఏమి అనలేని పరిస్థితి ఏర్పడింది.బీహార్లో జేడీయూనే ప్రధాన పక్షమైనా ఇటీవలి అసెంబ్లీ ఉపఎన్నికలో దారుణ ఓటమి తర్వాత భవిష్యత్ ఏమిటనే బెంగ పీడిస్తోంది.

అయితే ఈ పరిస్థితిలో మా దారి మేము చూసుకున్తామి అంటూ రెండు పార్టీలు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.శివసేన తరహా హిందుత్వవాదంతో కాంగ్రెస్ – ఎన్సీపీలకు ఇబ్బంది లేదు.

ఎందుకంటే బీజేపీని శివసేన అడ్డుకుంటుందని కాంగ్రెస్ – ఎన్సీపీలకు తెలుసు.మరోవైపు శివసేన నుంచి విడివడిన ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే ఇప్పటికే మోడీ ముక్త్ భారత్ అని నినదించి బీజేపీయేతర పక్షాల అభిమానం పొందారు.

మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ది మరో చిత్రమైన పరిస్థితి…ఆయనకీ రాజకీంగా శివసేనకి ఉన్న అవకాశాలు లేవు మహాకూటమి నుంచి దూకేసిన నితీశ్.కాంగ్రెస్ – ఆర్జేడీలతో శత్రుత్వం తెచ్చుకున్నారు.

దాంతో ఈ పరిణామాలతో నితీశ్ సొంతంగా అధికారానికి రాలేరు.దీం తో బీజేపీతో అంటకాగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

అయితే ఏమి చేసైనా సరే బీజేపి తో తెగ తెంపులు చేసుకుందామని ఇరు పార్టీలు తీవ్ర చర్చలు చేసుకుంటున్నారట ఒక వేళ వీరి వ్యూహాలు ఫలించి ఎన్డీయే నుంచీ వైదొలిగితే మాత్రం తప్పకుండా బీజేపి కి చావు దెబ్బ తగిలినట్టే అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube