టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి హీరోలు ఒకరు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోలు ఇద్దరు పాన్ ఇండియా సినిమాలలో నటించి పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందారు.
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఇకపోతే ఎన్టీఆర్ సైతం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.
ఇలా ఈ సినిమాలతో పాన్ ఇండియా హీరోలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హీరోలు నటించిన సినిమా విడుదలయ్యి కూడా కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటికీ మీరు తదుపరి సినిమాలు సెట్స్ పైకి వెళ్ళలేదు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరిచిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించారు.
ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.అదేవిధంగా అల్లుఅర్జున్ పుష్ప సినిమా తర్వాత ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ సైతం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉండటం వల్ల ఈ హీరోలు ఇద్దరు వేరే సినిమాలను ప్రకటించకుండా, ఉన్న సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లకుండా ఉండడంతో ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.అలాగే వీరి అభిమానుల సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీరితోపాటు నటించిన హీరోలు తదుపరి సినిమా షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీగా ఉండగా మీరు మాత్రం ప్రకటించిన సినిమాలు ఇంకా షూటింగ్ పనులు ప్రారంభించకపోవడంతో అసలేం జరుగుతోందోనని వీరి అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.