బయటపడ్డ మరో రెండు కొత్త జాతుల డైనోసార్ శిలాజాలు.. ఎక్కడంటే...?

కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూగ్రహాన్ని భారీ ఉల్క తాకడంతో డైనోసార్లు అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా పురాతన కాలం నాటి జంతువులు అంతరించిపోవడానికి కారణమని కొందరు విశ్వసిస్తుంటారు.

 Two Other New Species Of Dinosaur Fossils Have Emerged In England Isle Of Wight-TeluguStop.com

ఏది ఏమైనా కాలచక్రంలో ప్రతికూల వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులతో డైనోసార్ జాతి పూర్తిగా కనుమరుగైంది.అయితే అవి చనిపోయి కోట్ల సంవత్సరాలు గడుస్తున్నా.

డైనోసార్ల గురించి తెలుసుకోవాలని మానవులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.ఇప్పటికే వీటికి సంబంధించి ఎన్నో సినిమాలు, కథలు వచ్చి ప్రజాదరణ పొందాయి.

ఇక వీటి ఉనికి మరింత వివరంగా తెలియజేయడానికి పరిశోధకులు నిత్యం అన్వేషణలు కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో చాలా డైనోసార్ల అవశేషాలు లభ్యమయ్యాయి.

తాజాగా కూడా ఇంగ్లండ్ లోని ఐల్ ఆఫ్ వైట్ లో మరో రెండు కొత్త డైనోసార్ అవశేషాలు వెలుగులోకి వచ్చాయి.ఈ రాక్షస బల్లులు క్రెటేషియస్ కాలంలో మాంసం తింటూ బతికేవి.

అవశేషాలను బట్టి ఈ రాకాసి బల్లులు 30 అడుగుల పొడవుతో మొసలి లాంటి పొడవైన పుర్రెలతో చాలా భయంకరంగా ఉండేవని తెలుస్తోంది.

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.

కొత్తగా రెండు క్రెటేషియస్ కాలం నాటి మాంసాహారుల శిలాజాలను కనుగొన్నామని వెల్లడించారు.ఈ భారీ జీవులు స్పైనోసార్ అని పిలిచే ఒక రకమైన డైనోసార్ జాతికి చెందినవని.

ఇవి శంఖాకార దంతాలతో పొడవాటి, ఇరుకైన పుర్రెలతో ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు.ఈ జంతువులు భారీగా ఉండటంతో పాటు చాలా శక్తివంతమైనవి.

బలమైన చేతులు, పంజాలతో ఎంతటి ప్రత్యర్థినైనా.క్షణాల్లోనే మట్టికరిపించి గల శక్తి వీటికి ఉంటుంది.

Telugu Dinoras, England Isle, Ups, Scientistchris, Latest-Latest News - Telugu

తాజాగా లభ్యమైన ఒక డైనోసార్ పేరు సెరాటోసూప్స్ ఇన్‌ఫెరోడియోస్ అని నామకరణం చేశారు.కొమ్ముల మొసలి ముఖం కలిగిన జంతువు అని దీని అర్థం.ఇక రెండవ రాక్షసబల్లికి రిపరోవెనేటర్ మిల్నేరే అని నామకరణం చేశారు.బ్రిటిష్ పాలియోంటాలజిస్ట్ ఏంజెలా మిల్నర్‌ గౌరవార్థం దీనికి ఈ పేరు పెట్టారు.రిపరోవెనేటర్ మిల్నేరే అంటే “మిల్నర్స్ రివర్‌బ్యాంక్ హంటర్” అని అర్ధం.ఈ అవశేషాలకు సంబంధించిన అధ్యయనాన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

అధ్యయన ప్రధాన రచయిత, సౌతాంప్టన్ పీహెచ్‌డీ యూనివర్శిటీ ఆఫ్ పాలియోంటాలజీ శాస్త్రవేత్త క్రిస్ బార్కర్ అధ్యయనం గురించి మరిన్ని ఆసక్తికర వివరాలు తెలిపారు.తాజాగా కనుగొన్న డైనోసార్లలో ఒక్కొక్కటి సుమారు రెండు టన్నుల బరువు ఉండి ఉండొచ్చని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube