ఇదేందయ్యా ఇది : బ్రతికుండగానే సమాధులు నిర్మించుకున్న వృద్దులు…  

two old age couple, tombs before death, telangana, Kamareddy District news, - Telugu Kamareddy District News, Telangana, Tombs Before Death, Two Old Age Couple

మామూలుగా మనం మన నిజ జీవితంలో ఏదైనా ఖరీదైన వస్తువులను, కార్లని చూసినా  లేదా మరేదైనా వస్తువులను చూసినా వాటిలాగే ఉండేటువంటి వస్తువులని మనం కూడా కొనుక్కోవాలని లేదా తయారు చేయించుకోవాలని అనుకుంటాం.కానీ తాజాగా ఓ ఇద్దరు వృద్ధులు వేరే వాళ్ళు నిర్మించినటువంటి సమాధులు నచ్చడంతో ఏకంగా తమకు కూడా అలాంటివే కావాలని బ్రతికుండగానే తమ సమాధిని నిర్మించుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

 Two Old Couple Made Their Tombs Before Death

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లా కి చెందిన మద్నూర్ మండలంలోని ఓ గ్రామంలో సోపాన్, అంజనీ భాయ్ అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు.అయితే ఇటీవలే వీరు తమ దూరపు బంధువుల ఇంటికి వెళ్ళారు.

ఈ క్రమంలో ఆ ఊరిలో మరణించిన ఓ వృద్ధ దంపతులకు కట్టించిన సమాధులను చూడడంతో వీరికి బాగా నచ్చాయి.దీంతో వెంటనే తమకు కూడా అలాంటి సమాధులే కావాలని బ్రతికుండగానే తమ సొంత గ్రామంలో సమాధులను నిర్మించుకున్నారు.

ఇదేందయ్యా ఇది : బ్రతికుండగానే సమాధులు నిర్మించుకున్న వృద్దులు…-General-Telugu-Telugu Tollywood Photo Image

  అంతేగాక సమాధులపై విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 అంతేగాక ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు బ్రతికుండగానే సమాధులు నిర్మించుకోవడం ఏంటో విడ్డూరం కాకపోతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచారాలు, సంప్రదాయాలకు కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారని కానీ చనిపోయిన తర్వాత నిర్మించాల్సిన టువంటి సమాధులను బ్రతికుండగానే నిర్మించి కొత్త ట్రెండ్ ను సృష్టించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Old Couple Made Their Tombs Before Death Related Telugu News,Photos/Pics,Images..