ఇద్ద‌రు ఎంపీల‌కు టెన్ష‌న్‌గా మారిన నారా బ్రాహ్మ‌ణి

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి 2019లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్ప‌టికే తెర‌వెన‌క స్కెచ్‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి.ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి భ‌ర్త లోకేష్‌కు ఎమ్మెల్సీ రావ‌డంతో పాటు మంత్రి అవ్వ‌డంలో కూడా కీల‌క‌పాత్ర పోషించిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

 Two Mp’s Tension Over Nara Brahmani Political Entry-TeluguStop.com

ఇదిలా ఉంటే చంద్ర‌బాబు, లోకేష్‌తో పాటు బ్రాహ్మ‌ణి తండ్రి బాల‌య్య సైతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.వీరంతా స్టేట్‌లోనే ఉన్నారు.

త‌మ ఫ్యామిలీ నుంచి ఓ వ్య‌క్తి పార్ల‌మెంటులో ఉంటే ఢిల్లీలో భారీ లాబీయింగ్ చేయ‌వ‌చ్చ‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణిని ఎంపీగా పోటీ చేయించాల‌ని డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌ధాని విస్త‌రించి ఉన్న విజ‌య‌వాడ లేదా గుంటూరు లోక్‌స‌భ స్థానాల్లో ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేయించేందుకు స్కెచ్ రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బ్రాహ్మ‌ణి పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నారు.ఆమె త‌న భ‌ర్త‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేసే వ‌ర‌కు కూడా ఆమె బాబును నిద్ర‌పోనివ్వ‌లేద‌ట‌.ఇక గుంటూరు లేదా విజ‌య‌వాడల‌లో ఎక్క‌డో ఓ చోట నుంచి ఆమె ఎంపీగా పోటీ చేస్తే బ‌లంగా క‌లిసొచ్చే సొంత సామాజిక‌వ‌ర్గ ఓటు బ్యాంకుతో పాటు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి కంచుకోట‌లు.దీంతో అక్క‌డ నుంచి బ‌రిలో ఉంటే బ్రాహ్మణి గెలుపు సుల‌భ‌మ‌వుతుంద‌ని బాబు అండ్ కో లెక్క‌లు వేస్తున్నార‌ట‌.

బ్రాహ్మ‌ణి ఎంపీగా పోటీ చేస్తార‌న్న వార్త‌లు లీక్ అవుతుండ‌డంతో విజ‌య‌వాడ‌, గుంటూరు సిట్టింగ్ ఎంపీలు కేశినేని నాని, గ‌ల్లా జ‌య‌దేవ్‌కు టెన్ష‌న్ స్టార్ట్ అయిన‌ట్టు కూడా వార్త‌లు వస్తున్నాయి.బ్రాహ్మ‌ణి పొలిటిక‌ల్ ఎంట్రీ ఎలా ఉన్నా అప్పుడే ఈ ఇద్ద‌రు ఎంపీల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌న్న‌ది మాత్రం వాస్త‌వ‌మే అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube