బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని ఆ రెండు తెలుగు మూవీలు.. ఓపెనింగ్స్ కుమ్మేయనున్నాయా?

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇండియన్ మార్కెట్ మీద మన సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువుగా ఉంది అనే చెప్పాలి.పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పలకరించాయి.

 Two Movies Are A Tribute To Bollywood Heros , Bollywood Heros , Tollywood Heros , Pushpa 2 , Allu Arjun,prabhas,adipurush , Bollywood , Shahrukh Khan Pathan, Salman Tiger 3, Ranbir Animal,tollywood ,huge Openings-TeluguStop.com

అలాగే ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా అందుకున్నాయి.ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు.

పుష్ప నుండి మొదలైన సౌత్ మ్యానియా ఇప్పటికి తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతుంది.

మన తెలుగు హీరోలు కేవలం సౌత్ కు మాత్రమే పరిమితం కాకూండా బాలీవుడ్ లో సైతం పాగా వేస్తూ వారి మార్కెట్ ను విస్తరించు కుంటున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా మన హీరోలు మార్కెట్ పెంచుకుంటూ వారికీ నిద్రలేకుండా చేస్తున్నారు.ఒకప్పుడు హిందీ హీరోలు మాత్రమే భారీ ఓపెనింగ్స్ అందుకునే వారు.

కానీ ఇప్పుడు అలా కాదు.మన తెలుగు హీరోలు కూడా భారీ ఓపెనింగ్స్ అందుకుంటూ ముందుకు వెళుతున్నారు.ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టు కోలేదు.రిలీజ్ అయినా అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.ఇలా వరుస ప్లాపులతో సతమతం అవుతుంటే మన హీరోలు మాత్రం వరుస హిట్స్ అందుకుంటూ భారీ ఓపెనింగ్స్ కూడా అందుకున్నారు.

ఇక రాబోయే బాలీవుడ్ నుండి స్టార్ హీరోల సినిమాలు వరుస వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.ఇందులో షారుఖ్ ఖాన్ పఠాన్, సల్మాన్ టైగర్ 3, రణబీర్ యానిమల్ వంటి సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి.అయితే ఈ సినిమాలకు గట్టి పోటీగా మన తెలుగు సినిమాలు రెండు సిద్ధం అవుతున్నాయి.

మన రెండు తెలుగు సినిమాలు దాదాపు 40 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం అయితే ఉంది.అల్లు అర్జున్ పుష్ప 2 కాగా మరొకటి ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు ఉన్నాయి.

ఇవి వచ్చే ఏడాది గట్టి ఓపెనింగ్స్ రాబట్టడానికి సిద్ధం అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube