దేవుడా.. భారత్‌ లోకి మరో 2 కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ లు..!

యావత్ భారత దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసిన సంగతి అందరికి తెలిసిందే.కరోనా దెబ్బకి అందరు కొన్ని నెలల పాటు ఇంటికి పరిమితం అయ్యారు.

 Two More Varieties Of Corona Strain In India Found, Coronavirus, Strain, Southaf-TeluguStop.com

ఆర్ధికంగా, మానసికంగా అందరూ దెబ్బతిన్నారు.ఇప్పటికి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉంది.

ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు.అయితే, ఇప్పుడు మళ్ళీ భారత్‌ ఒక పెను ప్రమాదంలో పడనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు భారత్ లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.ఇవి దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల లోని స్ట్రెయిన్‌ మన దేశంలోకి ప్రవేశించిందని, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో ఆ దేశంలో ప్రభలుతున్న వైరస్ లక్షణాలు కనిపించాయని అధికారులు తెలియచేసారు.

అలాగే బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక్కరిలో కూడా ఆ దేశంలో విస్తరిస్తున్న వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నాయని చెప్పింది.

Telugu Brazil, Corona, Coronavirus, Officials, Southafrica, Strain-Latest News -

ఇలా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారు ఎవరెవరిని కలిశారు.ఎవరితో మాట్లాడారు.? అన్న విషయాలను ట్రేస్ చేశామని తెలిపారు.అయితే ఎవరు కంగారు పడవద్దని వాళ్ళందరిని కనిపెట్టి వాళ్ళని ఐసోలేషన్ ‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇక ఇప్పటికే మన భారతదేశంలో యూకే రకం కొత్త వైరస్ కేసుల సంఖ్య 187 కి పెరిగింది.

మళ్ళీ ఇప్పుడు ఈ వైరస్ ఒకసారి వ్యాప్తి చెందిందంటే అదుపు చేయడం కష్టం అని భావిస్తున్నారు అధికారులు.అయితే వీటితో ప్రజలు కాస్త అప్రత్తముగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

మధ్య కాలంలో కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో  మాములుగా వారి జీవన గమ్యం వైపు ఉరుకుపరుగుల జీవనాన్ని మొదలు పెట్టేసారు.ఇలాంటి వైరస్ లు మళ్లీ భారత్ లోకి ప్రవేశించడంతో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube