2022 ఐపీఎల్ నుండి మరో రెండు కొత్త జట్లు..!

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఐపీఎల్ లీగ్ లో కేవలం 8 జట్లు మాత్రమే ఉన్నాయి.ఈ ఎనిమిది జట్లు 60 మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నాయి.

 Ipl, Bcci, Permission, Permits, 2 More Teams,10 Teams, Gautam Adani, Sanjeev Goe-TeluguStop.com

కానీ 2022 నుంచి ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి.అంటే 2022లో ఇక ఐపీఎల్ లీగ్ లో మొత్తం 92 మ్యాచ్లు జరగనున్నాయి.అయితే 8 జట్లే లే ఎక్కువ అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో 10 జట్లు ఆడొచ్చు అనే ప్రతిపాదనకు 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఆమోదం తెలిపింది.8 టీమ్ లకు జతకలిసే మరొక రెండు కొత్త టీములను 2022 లో పరిచయం చేస్తామని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. గౌత‌మ్ అదానీ, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖ వ్యాపార వేత్తలు ఈ రెండు టీమ్ లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు రావడం వలన అంతర్జాతీయ టోర్నమెంట్ ప్రిపరేషన్ షెడ్యూల్ పై ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అలాగే 92 రోజుల పాటు విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఓ పెద్ద సమస్యగా కనిపిస్తోంది.

Telugu Teams, Bcci, Bccisecretary, Gautam Adani, Ipl, Ipl League, Olym, Permits,

ఇటీవల టి20 క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిపాదించింది.అయితే ఐసీసీ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ లో టి 20 ఫార్మాట్‌లో, క్రికెట్‌ను చేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బీబీసీఐ బోర్డు నిర్ణయించింది.అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నుండి కొన్ని క్లారిఫికేషన్ పొందిన తరువాతనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.

ఇండియాలో 2021 లో టి20 వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించడంతో పాటు 2023 వ సంవత్సరంలో 50 ఓవర్ల వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐని నిర్ణయించింది.అయితే వీటిని ఇండియాలో నిర్వహిస్తే పన్ను మినహాయింపు పొందగలమా లేదా అన్న అంశంపై ప్రభుత్వంతో చర్చించడానికి బీసీసీఐ కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్ ధుమల్ నిర్ణయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube