తెలంగాణలో మరో రెండు జిల్లాలు ! నోటిఫికేషన్ విడుదల

తెలంగాణాలో ఇప్పటికే 31 జిల్లాలు ఉన్నాయి.పరిపాలన సౌలభ్యం కోసం మరో రెండు జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

 Two More Districts In Telangana Notification Released-TeluguStop.com

ఈ మేరకు ములుగు, నారాయణపేటను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈమేరకు భూపాలపల్లి జిల్లాలోని ములుగు దాని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ములుగు, వెంకటాపూర్, మంగపేట్, వెంకటాపురం, తడ్వాల్, ఏటూరునాగారం, గోవిందరావ్పేట్, కన్నాయిగూడెం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో చేర్చారు.

కానీ….నారాయణపేట్ జిల్లాలో ఉన్న మండలాల విషయంపై అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.ఈ నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి నెల రోజుల్లో భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లకు ఎలాంటి సలహాలు, అభ్యంతరాలైనా తెలియజేయవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.వివిధ గ్రామాలు, మండల స్థాయిలో ఉన్న వారి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే కొత్త జిల్లా ఏర్పాటును గెజిట్లో చేరుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.

కాగా ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 33కి పెరగనుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube