బైక్ నడుపుతూనే స్నానం చేసిన ప్రబుద్ధులు,చివరికి అరెస్ట్

ఎంతగా ఆఫీస్ కు లైట్ అయినా ఎదో రకంగా ఆఫీస్ కు వెళ్ళిపోతూ ఉంటారు.ఈ క్రమంలో కొందరు హడావుడిగా ఒక చెంబుడు గబా గబా ఒంటిపై పోసుకొని కంగారుగా వెళ్లిపోతుంటారు.

 Two Men Bathe While Driving A Bike-TeluguStop.com

మరికొందరు అయితే స్నానం మానేసి,పైపై మేకప్ తో బయలుదేరి వెళ్ళిపోతూఉంటారు.అయితే ఈ ఇద్దరు ప్రబుద్ధులు మాత్రం బైక్ పై ప్రయాణిస్తూ రోడ్డు మీదే స్నానం చేశారు.

ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది.ఇద్దరు వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తూ రోడ్డు మీదే స్నానం చేశారు.

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడం తో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.అయితే రోడ్డు పియా వీరు చేసిన పనికి వాహనదారులు ఆశ్చర్యపోయారు.

ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతూ స్నానం చేశారు.బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ నడుపుతున్న వ్యక్తి పై నీళ్లు పోసి,సబ్బు రాయడం ఈ వీడియోలో కనిపించింది.

అయితే ఈ వీడియో వైరల్ గా మారడం తో ఆ వీడియోను చూసిన పోలీసులు యాక్షన్ లోకి దిగి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.స్నానం చేస్తూ బైకు నడిపిన ఆ యువకుడు హుయిన్ తన్ ఖాన్హ్ (23) అని తెలిసింది.

ఆ బైకు నెంబరు ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

ట్రాఫిక్ ఉల్లంఘనలు అతిక్రమించినందుకు రూ.5 వేలు జరిమానా కూడా విధించిన పోలీసులు ఈ వీడియోలో ఉన్న బైకు హుయిన్‌ది కాదని తెలుసుకొని డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తికి బైకు ఇచ్చినందుకు గాను ఆ బైకు యజమానికి కూడా రూ.4,300 జరిమానా పోలీసులు విధించినట్లు తెలుస్తుంది.అయితే ఇంతకీ ఈ ప్రబుద్ధులు ఇద్దరూ కూడా ఎందుకు రోడ్డు మీదే స్నానం చేయాల్సి వచ్చింది అన్న దానిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.మొత్తానికి రోడ్డు పై స్నానం చేసి వారిద్దరూ పోలీసుల అదుపులోకి వెళ్లాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube