ప్రముఖ బాలీవుడ్ తారా రాధిక ఆప్టే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం కొన్ని సెకన్ల పాటు న్యూడ్‌గా నటించింది.ఆ న్యూడ్ సీన్ లీక్ అయ్యింది.
సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన వీడియోను లీక్ చేసిన వారిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.సీన్స్ లీక్ అవ్వగానే దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని రోజుల్లోనే కేసును చేదించారు.అయితే లీక్ చేసిన వారు ఎవరు, ఎందుకు చేశారు అనే విషయంలో మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతానికి పోలీసుల ఆధీనంలో ఉన్న నింధితులను మీడియా ముందుకు తీసుకు వస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది.
ఒక హాలీవుడ్ ఫిల్మ్ పెస్టివల్ కోసం తీసిన షార్ట్ ఫిల్మ్ నుండి ఆ సీన్స్ లీక్ అవ్వడంతో దర్శకుడు తీవ్రంగా స్పందించాడు.నిందితులు దొరికారు కనుక ఇప్పుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఏం చేస్తాడు అనేది చూడాలి.