ఆడ సింహం కోసం పోరాడుకున్న మగ సింహాలు!  

Two Male Lions Fight For Female Lion-social Media,twitter,two Male Lions Fight,viral Video

ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోగొట్టుకున్న రాజులు ఉన్నారు.అదే ఆడవాళ్ళని గెలుచుకోవడం ఒకరికి ఒకరు తలపడ్డవారు ఉన్నారు.

Two Male Lions Fight For Female Lion-Social Media Twitter Two Viral Video

చరిత్రలో చాలా యుద్ధాలు ఆడవాళ్ళ వలెనే వచ్చాయని త్రివిక్రమ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ కచ్చితంగా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే గుర్తుకొస్తుంది.ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన ఘటన జరిగింది.అమ్మాయి కోసం రోడ్డు మీద కొట్టుకున్న అబ్బాయిలని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.అయితే ఇలాంటి గొడవలకి తాము ఏ మాత్రం అతీతులు కామని జంతువులు కూడా అప్పుడప్పుడు నిరూపిస్తూ ఉంటాయి.

తాజాగా ఓ ఫారెస్ట్ లో ఆడసింహం కోసం రెండు మగ సింహాలు పోట్లాడుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకదానితో ఒకటు ద్వంద్వ యుద్ధానికి దిగాయి.ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.రెండు సింహాలు పైచేయి సాధించడానికి ప్రయత్నం చేశాయి.చివరికి ఓ సింహం అలసిపోయి ఒక పోరాడలేక అక్కడి నుంచి తోక ముడుచుకొని జారుకుంది.విజయం సాధించిన దర్జాగా ఆడ సింహం దగ్గరకి వెళ్ళింది.

ఐఏఎఫ్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘కింగ్ వర్సెస్ కింగ్, ఓన్లీ ఫర్ ఏ క్వీన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు విధా అయిపోయారు.వీడియోను విపరీతంగా షేర్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.ఈ వీడియో చూసిన వారు ఆడవాళ్ళ కోసం యుద్ధాలు మనుషుల్లో మగాళ్ళ మధ్యనే కాదు ఇలా సింహాల మధ్య కూడా జరుగుతాయన్న మాట అని కామెంట్స్ పెడుతున్నారు.

.

తాజా వార్తలు

Two Male Lions Fight For Female Lion-social Media,twitter,two Male Lions Fight,viral Video Related....