సాయితేజ్ కు ప్రాణాపాయం తప్పడానికి కారణమైన వ్యక్తులు వీళ్లే?

యంగ్ హీరో సాయితేజ్ శుక్రవారం రోజున రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండగా సాయితేజ్ చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

 Two Main People Behind Sai Dharam Tej Life Rescue Details, Interesting Facts, Li-TeluguStop.com

అయితే సకాలంలో ఇద్దరు వ్యక్తులు స్పందించి సాయిధరమ్ తేజ్ కు ప్రాణాపాయం తప్పడానికి కారణమయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే అబ్దుల్ ఫరాన్ అనే సెక్యూరిటీ గార్డ్ స్పందించి సాయితేజ్ కు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు.

ఆంబులెన్స్ లో అబ్దుల్ సాయితేజ్ ను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ అనే వ్యక్తి కూడా ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి తక్కువ సమయంలోనే ఆస్పత్రికి ఆంబులెన్స్ చేరేలా చేశారు.

సరైన సమయంలో సాయితేజ్ ను ఆస్పత్రికి తరలించడంతో గండం గడిచిందని వైద్యులు చెప్పుకొచ్చారు.మరోవైపు అబ్దుల్ ఫరాన్ మాట్లాడుతూ తన వాహనంను ఓవర్ టేక్ చేసి సాయితేజ్ ముందుకెళ్లారని తెలిపారు.

సాయితేజ్ కిందపడిన సమయంలో హెల్మెట్ ఎగిరిపోయిందని చాతీ, కాలు, కనురెప్పల దగ్గర గాయాలయ్యాయని అబ్దుల్ తెలిపారు.

Telugu Rescue, Rayadurgam, Sai Tej Rescued, Saitej, Securityguard, Tollywood, Is

రాయదుర్గం పోలీసులు తనకు ఫోన్ చేసి అభినందించారని అబ్దుల్ పేర్కొన్నారు.సాయితేజ్ కుటుంబ సభ్యులలో ఎవరూ తనకు ఫోన్ చేయలేదని అబ్దుల్ వెల్లడించారు.మరోవైపు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Rescue, Rayadurgam, Sai Tej Rescued, Saitej, Securityguard, Tollywood, Is

బైక్ స్పీడ్ కు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని సమాచారం.రాయదుర్గం పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నారు.పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.సాయితేజ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.

ఇసుక వల్లే సాయితేజ్ కు ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారులకు సైతం నోటీసులు అందనున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube