దారుణం : పెళ్లి చేసుకుందామని గుడికి వెళ్తుంటే... మధ్యలోనే...

మన జీవితాల్లో  ఏది జరిగినా అది ఆ దైవ ఆజ్ఞ కు లోబడి ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని గుడికి వెళుతుండగా అనుకోని విధంగా ఒక కారు ప్రమాదం వారి జీవితాలను కబళించి వేసింది.

 Two Lovers Died In Car Accident In Hyderabad, Two Lovers Died In Car Accident In-TeluguStop.com

ఈ కారు ప్రమాదంలో ప్రేమికురాలు అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమికుడు చికిత్స నిమిత్తమై మార్గమధ్యంలో మరణించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని యాదాద్రి పట్టణ పరిసర ప్రాంతంలో నాగరాజు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

 అయితే ఇతడు స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని ప్రేమించాడు.  యువతి కూడా నాగరాజు ప్రేమని అంగీకరించడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

ఈ క్రమంలో   తన ద్విచక్రవాహనంపై తాను మరియు తన ప్రియురాలు కలిసి వెళుతుండగా సిగ్నల్ వద్ద ఆపారు.సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి మృత్యువు రూపంలో ఓ కారు వచ్చి ఢీకొట్టింది.

దీంతో నాగరాజు ప్రేమించిన యువతి అక్కడికక్కడే మృతి చెందగా నాగరాజు చికిత్స నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్నటువంటి నాగరాజు కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి.

 అంతేగాక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనే వారి జీవితాల్లో కారు పెను ప్రమాదం సృష్టించిందని  అంటూ వాపోయారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube