ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరేమోనని ప్రేమికులిద్దరూ...  

Two Lovers Commit Suicide In Karimnagar - Telugu Karimnagar Crime News, Karimnagar Latest News, Karimnagar News,, Two Lovers Commit Suicide News, Two Lovers Hanging, Two Lovers Sad News

ప్రస్తుత కాలంలో కొందరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు తమ కుటుంబ పెద్దలను ఒప్పించలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నిర్ణయాల వల్ల తమ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుతోంది.

 Two Lovers Commit Suicide In Karimnagar

తాజాగా ఇద్దరు ప్రేమికులు తమ కుటుంబ పెద్దలు తమ ప్రేమకు అంగీకరించరని తెలిసి ఊరి బయట ఉన్నటువంటి చెట్టుకు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్ నగర్ మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక మండలానికి చెందినటువంటి  గ్రామాలకు చెందినటువంటి ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు.

ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరేమోనని ప్రేమికులిద్దరూ…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగానే పెళ్లి చేసుకుని మంచి జీవితం గడపాలని కలలు కూడా కన్నారు.కానీ తమ కలలకి తమని కన్నవారు అడ్డుపడతారనే భయంతో ఎక్కడ విడిపోయి బ్రతకాల్సి వస్తుందేమోనని చావులో కూడా కలిసి ఉండాలనుకున్నారు.

అనుకున్నదే తడవుగా స్థానిక మండలంలోని అంకుషాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లి ఓ చెట్టుకి ఉరేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.అయితే పశువులను మేపడానికి వచ్చినటువంటి పశువుల కాపరి ప్రేమికుల మృతదేహాలను గమనించడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న టువంటి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పంచనామా నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఏదేమైనప్పటికీ ప్రేమించిన వాళ్ళతో సుఖంగా బ్రతకడం కోసం కన్న వాళ్ళకి తీవ్ర శోకాన్ని మిగల్చడం సరికాదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Lovers Commit Suicide In Karimnagar Related Telugu News,Photos/Pics,Images..