కేర్ టేకర్ నే పొట్టన పెట్టుకున్న సింహాలు...!

అతను మాములుగా జంతువుల ప్రేమికుడు.అందులోనూ సింహాలంటే అతగాడికి బహు ప్రీతి.ఆ ప్రేమతోనే వాటిని ఎంతో ప్రేమగా కొన్నేళ్లపాటు పెంచసాగాడు.కానీ, ఆ సింహాల చేతిలోనే అతని మరణం ఉంటుందని కలలో కూడా అతను అనుకోలేదు.అలా అనుకుంటే బహుశా పెంచేవాడు కాదేమో.కానీ, దురదృష్టవశాత్తూ అదే జరిగింది.

 Two Lions Killed His Care Taker Only  Lion, Care Taker, Died, Killed, Forest, Wh-TeluguStop.com

అవును.దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.

ప్రముఖ జంతు ప్రేమికుడు, రక్షకుడు అయినటువంటి మ్యాథూసన్ వయస్సు ఇంచుమించుగా 70 ఉంటుంది.

దాదాపు అతని జీవితమంతా సింహాల సేవలోనే గడిపాడు.ఇటీవల అతడి పెంపుడు సింహాలు ఆయన్ని చంపేయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ్యాథూసన్ లింపోపో ప్రావిన్స్ లో గత కొంత కాలంగా ‘లయన్ ట్రీటాప్ సఫారీ లాడ్జ్‘ రన్ చేస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం జంతువులను వేటాడే ప్రాంతం కేన్డ్ హంటింగ్ నుంచి అతడు రెండు తెల్ల ఆడ సింహాలను కాపాడి తెచ్చుకున్నాడు.

సాధారణ పెంపుడు జంతువులను ఎలా ట్రీట్ చేసేవాడో వాటిని కూడా అలాగే చూసేవాడు.ఈ క్రమంలో ఎప్పటిలాగానే బుధవారం ఉదయం తన తెల్ల సింహాలు, భార్యతో కలిసి మాథ్యూసన్ మార్నింగ్ వాక్ కి వెళ్లాడు.

అక్కడ ఏమైందో తెలీదు గాని ఒక్కసారిగా రెండు ఆడ సింహాలు మ్యాథూసన్ పై దాడి చేసి, దారుణంగా చంపేశాయి.ఆ సమయంలో అతడి భార్య పక్కనే ఉండి కూడా ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో స్పృహ కోల్పోయి పడిపోయింది.

ఇలా జరగడంతో మ్యాథూసన్ మనసు ఎరిగిన స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube