దేవుడా: ఆ బాలిక కడుపులో ఏకంగా రెండు కిలోల వెంట్రుకలు.. చివరికి..?!

అందరికీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం.మగవారు అయితే డిఫరెంట్ లుక్స్ తో కటింగ్ చేయించుకుంటారు.

 Two Kilos Hair Found In The Stomach Of Hyderabad Girl Poojitha-TeluguStop.com

అదే ఆడవాళ్లు అయితే జట్టును పొడవుగా పెంచుకుని ఆనందం పొందుతుంటారు.అయితే ఇటువంటి వెంట్రుకల వల్ల చాలా మందికి ఓ ప్రమాదం ఎదురవుతోంది.

మనం తరచూ వార్తల్లో వింటుంటాం.కడుపులో వెంట్రుకలు పేరుకుపోయినట్లు వార్తలు చదువుతుంటాం.

 Two Kilos Hair Found In The Stomach Of Hyderabad Girl Poojitha-దేవుడా: ఆ బాలిక కడుపులో ఏకంగా రెండు కిలోల వెంట్రుకలు.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఎలా జరుగుతుందోనని చాలా మందికి అర్థం కాదు.డాక్టర్లు చికిత్స చేసి ఆపరేషన్ ద్వారా వెంట్రుకలను బయటకు తీసిన తర్వాత అసలు విషయం తెలిసి వారు భయపడుతుంటారు.

ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ఓ యువతి కడుపులో రెండు కిలోల వెంట్రుకలను బయటకు తీశారు.

మొదట యువతి కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది.

వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యపోయారు.ఉస్మానియా వైద్యులు యువతి కడుపులో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు.

అలాంటి కేసు రావడం వారికి అది 68వది.హైదరాబాద్ లోని గగన్ పహాడ్ కు చెందిన యువతి పూజిత కొన్ని రోజులుగా వెంట్రుకలను తింటున్నట్లు తెలిసింది.

ఐదు నెలలుగా వెంట్రుకలు తినడం ద్వారా ఆమె కడుపులో అవి పేరుకుపోయాయి.దీంతో ఆమెకు రోజూ వాంతులు అయ్యేవి.

ఆమె అనారోగ్య నిమిత్తం తన సోదరి ఆస్పత్రిలో చేర్పించింది.

Telugu 2kgs, Found In The Stomach, Girl, Hair, Hyderabad Girl Poojitha, Social Meida, Stomach, Two Kilos Hair, Viral Latest, Viral News-Latest News - Telugu

అదే టైంలో ఆ యువతికి కరోనా పాజిటివ్ గా తేలింది.ఆ తర్వాత ఆమెను హోం ఐసోలేషన్ కు తరలించారు.31వ తేది యువతి కరోనా నుంచి కోొలుకుంది.ఆ తర్వాత అదే ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు స్కానింగ్ చేసి వెంట్రుకలను గుర్తించారు.వెంట్రుకలు జీర్ణాశయంలో పేరుకుపోయినట్లు గుర్తించారు.వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న రెండు కిలోల వెంట్రుకలను బయటకు తీసేశారు.ఆ తర్వాత ఆ యువతి పూర్తిగా కోొలుకుని శుక్రవారం రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యింది.

#Social Meida #Hair #Stomach #Two Kilos Hair #Girl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు