ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనిస్తే.. చివ‌ర‌కు ఏం చేశారంటే..?

ఇప్పుడున్న యుగం మొత్తం స్మార్ట్ ఫోన్‌ల‌ది అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు యూత్ అయినా లేదా పిల్లలు అయినా ఈ స్మార్ట్ ఫోన్ల‌కు మాత్ర‌మే అడిక్ట్ అవుతున్నారు.

 Two Kids In Khozikode Spent Over One Lakh Rupees For Pubg Game Without Knowing M-TeluguStop.com

ఇక ఇందులో ఉండే యాప్‌ల‌కు గానీ లేదా గేమ్‌ల‌కు గానీ ఎంత‌లా అట్రాక్ష‌న్ అయి అందులోనే మునిగి తేలిపోతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇక ఆన్‌లైన్ గేమ్స్ విష‌యానికి వ‌స్తే ఇప్పుడు ఎన్నో కుటుంబాలను కూల్చేస్తున్నాయ‌నే ఘ‌ట‌న‌లు అనేకం మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఎందుకంటే పెద్ద‌గా లోకజ్ఞాన్ తెలియని చిన్న పిల్లలు ఇలాంటి విప‌రీత‌మైన గేమ్ ల మోజులోప‌డి అనేక అనార్థాల‌కు బానిస‌ల‌వుతున్నారు.

ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్ల‌ల మెంటాలిటీని ఆస‌రాగా చేసుకుని సైబర్ మాయగాళ్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు.

నిలువునా ముంచేస్తున్నారు.కాగా ఇక వీరి ఉచ్చులో చిక్కుకుని ఎంత‌లా మోస‌పోతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వీరి మాయ‌లో ప‌డి ఎంద‌రో ఏకంగా త‌మ సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతున్న ఘ‌ట‌న‌లు కూడా అనేకం మనం చూస్తున్నాం.ఇక ఇప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఇలాంటి మాయలోనే ప‌డి ఏకంగా తల్లికి తెలియకుండా ఆమె బ్యాంకు ఖాతా నుంచి లక్ష రూపాయల దాకా తీసుకుని చివ‌ర‌కు నిండా మోస‌పోయిన ఘ‌ట‌న క‌ల‌కం రేపుతోంది.

Telugu Khozikode, Classes, Pubg Game, Pubji, Rupees, Mother-Latest News - Telugu

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే కోజికోడ్‌కు చెందిన మహిళ స్థానికంగా నివాసం ఉంటోంది.ఇక ఆమె భర్త విదేశాల్లో ఉండ‌గ‌తా ఇద్ద‌రు పిల్లలు తొమ్మిదో, పదో తరగతి చ‌ద‌వ‌డంతో వారిద్ద‌రినీ ఆమెనే ద‌గ్గ‌రుండి చూసుకుంటోంది.ఇక ఇప్పుడు క‌రోనా కారణంగా అంద‌రికీ ఆన్‌లైన్ క్లాసులే జ‌ర‌గ‌డంతో ఈ మ‌హిళ కూడా త‌న పిల్ల‌ల‌కు ఫోన్ కొనిచ్చింది.కాగా వారిద్ద‌రూ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు బానిస‌లుగా మారి పబ్‌జి గేమ్ కు చాలా బాగా అడిక్ట్ అయ్యారు.

ఇక ఈ ఆట‌లో నెక్ట్స్ లెవల్స్ కు వెళ్లాలంటే మ‌నీ చెల్లించ‌డానికి త‌మ అమ్మ‌గారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లాంటి డీటేయిల్స్‌ను తీసుకుని దాదాపు ల‌క్ష వ‌ర‌కు కొట్టేశారు.ఇక అస‌లు విష‌యం తెలియడంతో ఆమె తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube