బీస్ట్ చూడడానికి హాలిడే ఇచ్చిన రెండు ఐటీ కంపెనీలు.. ఇలా జరగడం ఇదే తొలిసారి!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

 Two It Companies Have Given Their Employees A Holiday To Watch Vijay Beast, Thal-TeluguStop.com

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.

ఇక తాజాగా విజయ్ నటించిన సినిమా బీస్ట్.ఈ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్ లోకి వచ్చింది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.సామాన్య ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూసారు.ఇక ఈ సినిమా థియేటర్ లోకి రావడంతో అన్ని చోట్ల సందడి మొదలయ్యింది.

అయితే తాజాగా విజయ్ ఫ్యాన్స్ అంతా సంబర పడే వార్త ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.మాములుగా మనం అనుకుంటూ ఉంటాం.

మన అభిమాన హీరో సినిమా వచ్చిన రోజు ఫస్ట్ డే నే చూడాలి అని.కానీ ఉద్యోగం కారణంగా వెళ్లలేము.

అప్పుడు అనిపిస్తూ ఉంటుంది.మనం చేసే కంపెనీ మనకు సినిమా చూడమని హాలిడే ఇస్తే బాగుండు అని.ఎందుకంటే.మన హీరో సినిమా ఫస్ట్ డే చుస్తే ఆ కిక్కే వేరు.

కానీ అది మన ఊహ మాత్రమే అలా ఎవరు కూడా సినిమా చూడడానికి సెలవు ఇవావరు.కానీ చెన్నై లోని ఈ రెండు ఐటీ కంపెనీలు మాత్రం విజయ్ బీస్ట్ చూడడానికి సెలవు ప్రకటించాయి.

Telugu Beast-Movie

చెన్నైలోని ఆరా ఇన్ఫోమాటిక్స్ మరియు నిట్‌ బ్రెయిన్ అనే రెండు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు బీస్ట్ సినిమా చూడటానికి సెలవు ఇచ్చాయి.ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.మన ఇండియాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.దీంతో విజయ్ క్రేజ్ చూసి ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube